ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారథి డేవిడ్ వార్నర్‌కు భారత్‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథికి తెలుగు నాట మంచి అభిమాన గణం ఉంది. ఎస్ఆర్హెచ్ను వీడినప్పటికీ వార్నర్‌ను తెలుగు క్రికెట్ అభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ మూవీస్‌ను తెగ ఇష్టపడే వార్నర్ సన్‌రైజర్స్‌లో ఉన్నప్పుడు పాపులర్ తెలుగు సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేసేవాడు. అయితే ఎస్ఆర్హెచ్ను వీడినా తెలుగు మూవీస్‌పై ఆయనకు ఇష్టం అలాగే ఉండిపోయింది. ‘బుట్టబొమ్మ’ పాటతో పాటు ‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున్ మేనరిజమ్స్‌తో అలరిస్తూనే ఉన్నాడు వార్నర్. అలాంటి వార్నర్ మరోసారి తెలుగు చిత్రాలపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
తెలుగు సినిమాల్లో తనకు నటించాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టాడు వార్నర్. టాలీవుడ్ మూవీస్‌లో తనకు విలన్‌గా యాక్ట్ చేయాలని ఉందని చెప్పాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రష్మికా మందన్నతో కలసి పని చేయాలనేది తన డ్రీమ్ అని వార్నర్ పేర్కొన్నాడు. ప్రముఖ యాంకర్ గౌరవ్ కపూర్ నిర్వహించిన ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో అతడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. బ్యాడ్ బాయ్‌గా విలన్ రోల్లో కనిపించాలని ఉందని చెప్పుకొచ్చాడు. అది తన ప్రవృత్తి అని వార్నర్ తెలిపాడు. బాలీవుడ్లో తనకు ‘షీలా కీ జవానీ’, ‘మై తేరా హీరో’, ‘చమ్మక్ చల్లో’ సాంగ్స్ మాత్రమే తెలుసునన్నాడు. మరి.. తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రలో వార్నర్ నటిస్తే చూడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
You Can Give Rashmika Mandanna that Opportunity 🙌
~ @davidwarner31David Warner says Dream Cast : #AlluArjun#Rashmika and Mahesh #RashmikaMandanna @alluarjun #Pushpa2TheRule #DavidWarner @iamRashmika pic.twitter.com/EOxN8qWRdz
— PushpaTheRule ⭐ (@uicaptures) May 20, 2023