ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో వార్నర్ జడేజా మధ్య ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. 20 ఓవర్లలో 3 వికెట్లను 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే చెన్నైకి కీలకంగా మారిన ఈ మ్యాచులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (79), కాన్వే(87) భారీ అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే సిక్సర్లతో చెలరేగగా.. చివర్లో జడేజా మెరుపు ఇన్నింగ్స్ హైలెట్ గా మారింది. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓటమి దిశగా కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో వార్నర్ .. జడేజా మధ్య ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి నాలుగు ఓవర్లలో కేవలం వికెట్ నష్టానికి 15 పరుగులు మాత్రమే చేసింది. 5 వ ఓవర్ వేయడానికి దీపక్ చాహర్ బౌలింగ్ కి రాగా.. తొలి రెండు బంతుల్లో ఒక సిక్సర్, ఫోర్ తో 10 పరుగులు రాబట్టాడు. ఇక మూడో బంతిని ఆఫ్ సైడ్ వైపుగా ఆడిన వార్నర్.. ఒకపరుగు పూర్తి చేసాడు. అయితే మొయిన్ అలీ వేసిన ఓవర్ త్రో వలన రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ దశలో రహానే చేతిలో బంతి ఉండగానే వార్నర్ గ్రీజ్ లో బ్యాట్ ఉంచకుండా ఫీల్డర్ ని ఊరించాడు. రహానే త్రో వేయగా.. అది కాస్త జడేజా చేతులోకి వెళ్ళింది.
ఇక అసలు కధ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. వార్నర్ ని ఆట పటిద్దామనుకొని జడేజా బంతిని చేతిలోనే ఉంచుకొని వేస్తున్నట్లుగా కనిపించాడు. అది గమనించిన వార్నర్ ఏ మాత్రం తగ్గకుండా జడేజా సెలెబ్రేషన్ న్నీ జడేజాకు చూపిస్తూ స్వారీ చేసాడు. గ్రీజ్ లో ఒక అడుగు ముందుకే ఉండి ఇదంతా చేయడం నవ్వులు తెప్పించింది. ఇది చూసిన సాల్ట్ కూడా తెగ నవ్వుకున్నాడు. మొత్తానికి ఈ సీజన్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న వార్నర్ మంచి వినోదాన్ని పంచాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
The mind-games have hit a new high here in Delhi 😃#TATAIPL | #DCvCSK | @imjadeja | @davidwarner31
Watch the Warner 🆚 Jadeja battle here 🎥🔽 pic.twitter.com/o5UF6U2sAY
— IndianPremierLeague (@IPL) May 20, 2023