జీవితంలో వివాదాలు, విబేధాలు ఎవరికైనా సహజం. అయితే వాటిని చిరునవ్వుతో స్వీకరించడం కొందరికే సాధ్యం. ఈ లిస్టులో ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ వార్నర్ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ఇప్పుడు వార్నర్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. మరి వార్నర్ ఏం ట్వీట్ చేసాడు? ఈ ట్వీట్ స్పెషల్ ఏంటి ?
క్రికెట్ మ్యాచ్ అంటే ఫోర్లు, సిక్సులు మాత్రమే కాదు..వివాదాలు, విమర్శలు , మనస్పర్థలు కూడా ఉంటాయి. బాగా ఆడకపోతే విమర్శలు.. విమర్శించడం వలన వివాదాలు, వివాదాల వలన మనస్పర్థలు రావడం సహజంగా ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. గ్రౌండ్ లో మన ముందు కనిపించేది కేవలం మ్యాచ్ మాత్రమే అయినా.. తెర వెనుక చాలానే జరుగుతుంటాయి. ఇక ఐపీఎల్ అంటే ఇలాంటివి జరగడం చాలా సాధారణం. అయితే వాటిని చిరునవ్వుతో స్వీకరించడం కొందరికే సాధ్యం. ఈ లిస్టులో ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ఇప్పుడు వార్నర్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. మరి వార్నర్ ఏం ట్వీట్ చేసాడు? ఈ ట్వీట్ స్పెషల్ ఏంటి ?
సన్ రైజర్స్ తో వార్నర్ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. 2014 లో తొలిసారి హైదరాబాద్ జట్టులో చేరిన ఈ స్టార్ ఓపెనర్ అప్పటినుంచి దాదాపు ప్రతి సీజన్లో ప్లే ఆఫ్ కి చేర్చాడు. కెప్టెన్ గానే కాదు.. బ్యాటర్ గాను అదరగొడుతూ ప్రతి సీజన్లో 500 పైగా పరుగులు చేసిన ఘనత వార్నర్ సొంతం. ఈ క్రమంలో 2016 లో బెంగళూరు తో జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ ని గెలిపించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. అప్పటినించి వార్నర్ అంటే తెలుగు వారికి ప్రేత్యేకమైన అభిమానం చూపించేవారు. వార్నర్ కూడా తెలుగు నాట బాగా కలిసిపోయాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. 2021 లో మాత్రం వార్నర్ బ్యాటింగ్ లో దారుణమైన ప్రదర్శన చేసాడు.
వార్నర్ పేలవ ఫామ్ లో ఉండడంతో .. కెప్టెన్సీ బాధ్యతలు అతని స్థానంలో విలియంసన్ కి అప్పగించారు. అయితే ఎవ్వరు ఊహించని విధంగా వార్నర్ కి తుది జట్టులో కూడా స్థానం ఇవ్వకపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతే కాదు కొన్ని మ్యాచులకి ప్లేయర్లకి డ్రింక్స్ అందిస్తూ కనిపించాడు. ఇది సగటు క్రికెట్ అభిమానిని కలచి వేసింది. దీనికి కారణం వివిఎస్ లక్ష్మణ్, ట్రావిస్ బెయిలీ అని అప్పట్లో వార్తలొచ్చాయి. వార్నర్ కూడా తనను పక్కన పెట్టడానికి కారణం తెలియదని చెప్పుకొచ్చాడు. ఇక అప్పటి నుంచి వార్నర్ కి, సన్ రైజర్స్ మధ్య విబేధాలు వచ్చాయి. సమస్య పెద్దదిగా మారడంతో అనుకున్నట్లుగానే 2022 లో వార్నర్ ని సన్ రైజర్స్ వదిలేసుకుంది.
ఇక 2022 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అడుగు పెట్టిన వార్నర్.. 2023 లో పంత్ గాయం కారణంగా కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ మీద తనకు ఇంకా ప్రేమ లేదని నిన్న ట్వీట్ చూస్తే అర్ధం అవుతుంది. SRH విజయానికి చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు కావాల్సిన దశలో గ్లెన్ ఫిలిప్స్ వరుసగా 6,6,6,4 కొట్టి మ్యాచుని ఆసక్తికరంగా మార్చాడు. ఇక ఆ తర్వాత ఫిలిప్స్ ఔటైనా.. అబ్దుల్ సమద్ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. అయితే ఇప్పుడు SRH గెలిచినందుకు వార్నర్ సంతోషం వ్యక్తం చేసాడు. వార్నర్ ట్వీట్ చేస్తూ “ఫిలిప్స్ ఒత్తిడిలో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడావు. SRH కి నా అభినందనలు” అని వార్నర్ తన మాజీ జట్టు మీద అభిమానం చాటుకున్నాడు. ఒకప్పుడు వార్నర్ ని దారుణంగా అవమానించినా.. అవేమి మనసులో పెట్టుకోకుండా వార్నర్ ఇలా SRH ని అభినందిస్తూ ఈ ట్వీట్ చేయడం తన గొప్ప మనసుకి నిదర్శనం. ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
How goods the IPL, Glenn Phillips take a bow, Well played Sunrisers 👌👌🔥🔥
— David Warner (@davidwarner31) May 7, 2023