ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యాటర్ ఎవరు అంటే? అందులో కచ్చితంగా డేవిడ్ వార్నర్ పేరు ఉంటుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కూడా దుమ్మురేపుతున్నాడు డేవిడ్ భాయ్. ఈ క్రమంలోనే రోహిత్ రికార్డును బద్దలు కొడుతూ.. ఓ అరుదైన రికార్డును సృష్టించాడు వార్నర్. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2023 సీజన్ లో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. గురువారం అరుణ్ జైట్లీ వేదికగా కోల్ కత్తా తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచి.. ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఢిల్లీ టీమ్ గెలిచింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 6 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్లో విజయం సాధించడం గమనార్హం. జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 11 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన వార్నర్ ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన ఘనతను నమోదు చేశాడు. అదీకాక రోహిత్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు.
డేవిడ్ వార్నర్.. ప్రపంచ క్రికెట్ లో నిలకడైన బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. ఫార్మాట్ ఏదైనా తనదైన బ్యాటింగ్ తో పరుగులు సాధిస్తుంటాడు ఈ ఆసీస్ స్టార్ బ్యాటర్. ఇక ఐపీఎల్ అంటే వార్నర్ కు పూనకం వస్తుంది. ప్రతి సీజన్ లో పరుగులు సాధిస్తూ.. నమ్మకమైన ప్లేయర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇక ఈ సీజన్ లో కూడా కంటిన్యూస్ గా పరుగులు చేస్తూ.. ఢిల్లీ జట్టుకు వెన్నముకగా నిలుస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఆడిన 6 మ్యాచ్ ల్లో 4 అర్ధశతకాలు సాధించాడు వార్నర్. తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీతో మెరిసి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సాధించాడు డేవిడ్ భాయ్. దాంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డు సైతం తుడిచిపెట్టుకుపోయింది. వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ చరిత్రలో కోల్ కత్తా జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు కేకేఆర్ జట్టుపై 26 మ్యాచ్ లు ఆడిన వార్నర్ 1042 పరుగులు చేశాడు. అంతకు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. అతడు కేకేఆర్ జట్టుపై 1040 రన్స్ కొట్టాడు. తాజా మ్యాచ్ తో ఈ రికార్డును బద్దలు కొట్టాడు వార్నర్. ఇక రోహిత్ తర్వతి స్థానంలో శిఖర్ ధావన్ 850 పరుగులతో ఉన్నాడు. మరి రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన వార్నర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
David Warner has scored the most runs against KKR in IPL history, over takes Rohit.
An IPL GOAT – Warner. pic.twitter.com/yFCmRYItfL
— Johns. (@CricCrazyJohns) April 20, 2023