నిత్యం సినిమాలతో బిజీ బిజీగా ఉండే అక్కినేని వారసుడు నాగచెతన్య చెపాక్ గడ్డపై సందడి చేశాడు. సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, కామెంట్రీ బాక్స్‌లో కనిపించిన నాగచైతన్య కామెంటేటర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చాడు.
చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ సాగుతోంది. టాస్ గెలిచి చెన్నై బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ చేపట్టిన ఎస్ఆర్‌హెచ్ సరైన లక్ష్యాన్ని నిర్ధేశించడం కోసం శక్తికిమించి పోరాడుతోంది. సొంతగడ్డపై చెన్నై బౌలర్లు విజృంభించడంతో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. ఇదిలావుంటే నిత్యం సినిమాలతో బిజీ బిజీగా ఉండే అక్కినేని వారసుడు నాగచెతన్య చెపాక్ గడ్డపై సందడి చేశాడు. కామెంట్రీ బాక్స్‌లో కల్యాణ్, వెంకటపతిరాజుతో కలిసి కనిపించిన నాగచైతన్య పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చెన్నైలో చదువుకుంటున్నప్పుడు గల్లీ క్రికెట్ ఎక్కువగా ఆడేవాడినని చెప్పిన నాగచైతన్య, కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్ కోసం చీటింగ్ చేసినట్లు వెల్లడించాడు. అలాగే, మజిలీ సినిమా కోసం ప్రత్యేకంగా క్రికెట్‌లో శిక్షణ పొందినట్టు తెలిపాడు. అయితే కోచింగ్‌లో బౌలింగ్ నేర్పిస్తే.. తాను మాత్రం ఎక్కువగా బ్యాటింగే చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇక ఇవాళ జరుగుతోన్న చెన్నై సూపర్ కింగ్స్-హైదరాబాద్ జట్లలో ఏది గెలవాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. ఇరు జట్లలోని మన ఆటగాళ్లు ఉన్నారన్న చై, బాగా ఆడిన జట్టే గెలుస్తుందని చెప్పుకొచ్చాడు.
In love witj this side of @chay_akkineni 💙💙 #Custody #NagaChaitanya pic.twitter.com/8yDhzNyBFq
— Prasad (@PrasadAGVR) April 21, 2023
ఇక ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు నాగచైతన్య ఎంఎస్ ధోనీని ఎంచుకున్నాడు. మైదానంలో ధోనీ ఎంత ఒత్తిడిలో ఉన్నా చాలా కూల్‌గా కనిపిస్తాడని, అది తనకు చాలా బాగా నచ్చుతుందని తెలిపాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు సహనం ఎంతో అవసరమని, ఓ నటుడిగా అది తనకు కూడా ఉండాల్సిన ఎంతో ముఖ్యమైన క్వాలిటీ అని ఈ సందర్బంగా వెల్లడించాడు. కాగా, నాగ చైతన్య- వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కిన కస్టడీ చిత్రం మే 12న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా చై చక్కర్లు కొడుతున్నాడు.
Naga Chaitanya #CSKvsSRH pic.twitter.com/mlGv12gz8s
— Sandy… (@sandeepginka4) April 21, 2023