ప్లేఆఫ్స్ బెర్త్ అధికారికంగా కన్ఫర్మ్ కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఒక విషయం భయపెట్టిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని సీఎస్కేలో కొత్త గుబులు మొదలైంది.
ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ బెర్త్‌లపై శనివారం దాదాపుగా క్లారిటీ వచ్చేయనుంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచులో చెన్నై, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడబోయే మ్యాచులో లక్నో తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో దూసుకొచ్చిన సీఎస్కే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఓటమితో తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆ జట్టుకు కీలకంగా మారింది. వరుస ఓటములతో డీలాపడి, ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోయిన ఢిల్లీని ఓడించడం సీఎస్కేకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటా ఢిల్లీ కంటే చెన్నై జట్టు ఎంతో బలంగా కనిపిస్తోంది.
టీమ్‌ను ముందుండి నడిపే మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని ఎలాగూ ఉండనే ఉన్నాడు. అయితే ఒక విషయం మాత్రం సీఎస్కేను తెగ ఇబ్బంది పడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెయిన్బో జెర్సీలో గ్రౌండ్లోకి దిగనుంది. ఇదే ఇప్పుడు చెన్నై జట్టులో కంగారు పెంచుతోంది. ఐపీఎల్-2020 నుంచి డీసీ టీమ్ ప్రతి సీజన్లోనూ ఒక మ్యాచ్‌ను రెయిన్బో జెర్సీలో ఆడుతోంది. ఆ జెర్సీలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఢిల్లీ విక్టరీ కొట్టింది. 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 59 రన్స్ తేడాతో చిత్తు చేసిన డీసీ.. ఆ తర్వాతి సీజన్లో ముంబై ఇండియన్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో మరోసారి రెయిన్బో జెర్సీతో బరిలోకి దిగుతున్న డీసీ.. చెన్నైని కూడా ఓడిస్తే? అప్పుడు సీఎస్కే ప్లేఆఫ్స్ కష్టాలు మొదలవుతాయి. ముంబై లేదా ఆర్సీబీ జట్టు తమ ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోవాలని ధోని సేన కోరుకోవాల్సి ఉంటుంది.
All in readiness 🙌
LIVE action coming up in Delhi ⏳
What are your predictions 🤔 #TATAIPL | #DCvCSK pic.twitter.com/5qnE7rOkV4
— IndianPremierLeague (@IPL) May 20, 2023