చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ కప్పులకే కాదు. రికార్డులకు కూడా కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. అలా ఓ రికార్డుని గత 12 ఏళ్లుగా చెక్కు చెదరనీయట్లేదు. ఇంతకీ ఏంటి విషయం?
చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేసింది. ప్లే ఆఫ్స్ కి ఆల్మోస్ట్ అర్హత సాధించేసింది. తాజాగా హోమ్ గ్రౌండ్ లో దిల్లీపై ఫుల్ డామినేషన్ చూపించింది. అలా ఫ్యాన్స్ అనుకున్నట్లే 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక్కడివరకు బాగానే ఉంది. చెన్నై గెలవడం కాదు.. ఓ అరుదైన రికార్డుని గత 12 ఏళ్లుగా చెక్కు చెదరనీయలేదు. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా ధోనీ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధుల్లేకుండా పోయాయి. ఇంతకీ ఏంటా రికార్డు?
ఇక వివరాల్లోకి వెళ్తే.. చెపాక్ అంటే చెన్నై డామినేషన్ కచ్చితంగా ఉంటుంది. తాజాగా దిల్లీతో మ్యాచ్ లోనూ సేమ్ సీన్ రిపీటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 167/8 స్కోరు చేసింది. బ్యాటర్ల అందరూ తలో చేయివేశారు. చివర్లో ధోనీ, 2 సిక్సులు కొట్టి ఫ్యాన్స్ కి పునకాలు తెప్పించాడు. ఛేదనలో దిల్లీ బాగానే ఆడింది కానీ చెన్నై బౌలర్లు చాలా పకడ్బందీగా బౌలింగ్ చేసేసరికి రన్స్ కొట్టలేకపోయాడు. దీంతో ఓవర్లన్నీ పూర్తి చేసి కేవలం 140/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. దీంతో ఓటమి తప్పలేదు.
అయితే చెన్నై సూపర్ కింగ్స్.. గత 12 ఏళ్లుగా దిల్లీ జట్టుపై డామినేషన్ చూపిస్తూనే ఉంది. గత మూడు మ్యాచుల్లో దిల్లీపై విజయం సాధించిన సీఎస్కే.. చెపాక్ లో మాత్రం 2011 నుంచి ఇప్పటివరకు వరసగా ఏడు మ్యాచుల్లోనూ గెలిచింది. ఓ జట్టుపై ఇలా పూర్తి ఆధిపత్యం చూపించిన రికార్డుని అస్సలు చెక్కుచెదరనీయట్లేదు. ఇప్పుడదే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నెటిజన్స్ మాత్రం దిల్లీ బదులు ఆర్సీబీ లేదా ముంబయి ఇలా బలైపోయింటే బాగుండేదని మాట్లాడుకుంటున్నారు. మరి గత 12 ఏళ్లుగా దిల్లీపై సీఎస్కే డామినేషన్ చూపిస్తుండటంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
DO NOT MISS!
When @msdhoni cut loose! 💪 💪
Follow the match ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC | @ChennaiIPL pic.twitter.com/kduRZ94eEk
— IndianPremierLeague (@IPL) May 10, 2023