ఒక్క నో బాల్ వల్ల ఏం జరుగుతుంది? మహా అయితే ఫ్రీ హిట్ లభిస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి ఓ నో బాల్ చెన్నై జట్టు ఐపీఎల్ లో 10వసారి ఫైనల్ కి చేరడానికి కారణమైంది. ఇంతకీ ఏంటి సంగతి?
చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. 14 సీజన్లలో 12సార్లు ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. తాజాగా గుజరాత్ పై గెలిచి ఏకంగా 10వసారి ఫైనల్ కి చేరింది. ఐపీఎల్ లో ఇప్పటివరకు మరే జట్టు కూడా ఇన్నిసార్లు ఫైనల్ లో అడుగుపెట్టలేదు. అయితే చెపాక్ లో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ ఓడిపోవడం, పెద్దగా స్కోరు చేయకపోయేసరికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ గుజరాత్ ఈజీగా గెలిచేస్తుందని అనుకున్నారు. కానీ ధోనీ మ్యాజిక్ చేసి చూపించాడు. చెన్నైని గెలిపించాడు. అయితే మ్యాచ్ లో ఓ నో బాల్ వల్ల చెన్నై గెలిచి, గుజరాత్ ఓడిపోయిందంటే నమ్ముతారా? కానీ ఇదే నిజం! ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
అసలు విషయానికొచ్చేస్తే.. ‘క్లాస్ లో క్వశ్చన్ కి ఆన్సర్ ఎవడైనా చెబుతాడు, ఎగ్జామ్ లో రాసేవాడు టాపర్ అవుతాడు’ అని జులాయి మూవీలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ చెన్నై సూపర్ కింగ్స్ కి సరిపోతుంది. ఎందుకంటే లీగ్ దశలో గుజరాత్ చేతిలో ఓడిపోయిన సీఎస్కే.. కచ్చితంగా గెలిచి తీరాల్సిన ప్లే ఆఫ్స్ లో గర్జించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 172/7 స్కోరు చేసింది. ఛేదనలో గుజరాత్ తడబడింది. వరస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్ల పాటు ఆడి 157 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 15 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ తేడా గుర్తుపెట్టుకోండి కాస్త మాట్లాడుకుందాం.
ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు, బౌలర్లు ప్రతి ఒక్కరూ అదరగొట్టేశారు. తొలుత చెన్నై బ్యాటింగ్ చేస్తున్న టైంలో అంటే 1.3 ఓవర్ బంతిని దర్శన్ నల్కండే వేశాడు రుతురాజ్ ఔటయ్యాడు. కానీ అది నోబాల్ గా తేలడంతో గైక్వాడ్ బతికిపోయాడు. అదే బంతికి దక్కిన ఫ్రీ హిట్ కి సిక్స్ కొట్టి, ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 60 పరుగులు చేశాడు. ఒకవేళ ఇదే రుతురాత్.. అది నో బాల్ కాకపోయింటే ఔటయ్యేవాడు. చెన్నై తక్కువ స్కోరు కొట్టేది. గుజరాత్ గెలిచి ఉండేది. సో అదనమాట విషయం. ఒక్క నో బాల్ తో ఏం జరుగుతుందిలే అని గుజరాత్ అనుకుని ఉండొచ్చు. కానీ అదే బంతి వల్ల చెన్నై ఏకంగా 10వ సారి ఫైనల్ కి చేరుకుని రికార్డు సృష్టించింది. చెన్నై మ్యాచ్ గెలవడానికి ఇతర కారణాలు ఉన్నప్పటికీ.. గుజరాత్ చేసిన ఈ పొరపాటే ఇప్పుడు మెయిన్ హైలెట్ గా నిలిచింది. మరి ఈ విషయంపై మీరేం అంటారు? కింద కామెంట్ చేయండి.
Darshan Nalkande gives Ruturaj Gaikwad a lifeline!
📸: JioCinema#RuturajGaikwad #DarshanNalkande #CSKvGT #CSKvsGT #GTvCSK #GTvsCSK #IPL #IPL2023 #Cricket #SBM pic.twitter.com/JDtkpfSDcJ
— SBM Cricket (@Sbettingmarkets) May 23, 2023