చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో ఫస్ట్ టైమ్ 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ని ఉపయోగించి చరిత్ర సృష్టించింది. కానీ అదే సీఎస్కేకు రివర్స్ కొట్టేసింది. సదరు ప్లేయర్లని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
ఐపీఎల్ లో ఈసారి పలు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. వాటిలో చెప్పుకోదగ్గది అంటే ‘ఇంపాక్ట్ ప్లేయర్’. ఈ నిబంధన ఉపయోగించుకున్న తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అయితే దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం పూర్తిగా ఫెయిలైందనే చెప్పాలి. ఎందుకంటే మ్యాచ్ ని మలుపు తిప్పి, వీలైతే గెలిపించాల్సిన బాధ్యత ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’పై ఉంది. కానీ గుజరాత్ తో మ్యాచ్ లో మాత్రం ఈ రూల్ చెన్నైకి రివర్స్ అయిందనే చెప్పాలి. ఏం జరిగిందనేది తెలిస్తే.. ఈ విషయం మీరే ఒప్పుకొంటారు. ఆ బౌలర్ ని ఎందుకు తీసుకున్నార్రా బాబు అని అంటారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్-చెన్నై జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. రుతురాజ్ బ్యాటింగ్ చూస్తే ఈజీగా 200 దాటేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ చివర్లో బ్యాటర్లు పరుగులు చేయకపోవడంతో ఈ స్కోరుకు పరిమితమైంది. ఇక గుజరాత్ ఇన్నింగ్స్ స్టార్ట్ కావడానికి ముందు తుషారే దేశ్ పాండేని అంబటి రాయుడికి బదులు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపింది. కానీ చెన్నై ఓటమికి ఓ కారణమయ్యాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఛేదనలో ఏ జట్టు అయినా సరే ప్రత్యర్థిని కట్టడి చేయాల్సి ఉంటుంది. తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తుషార్ మాత్రం పూర్తిగా చేతులెత్తేశాడు. 3.2 ఓవర్లలో ఏకంగా 51 పరుగులిచ్చేశాడు. తొలి మ్యాచ్ లోనే సీఎస్కే ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయ్యాడు. దీంతో అతడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో తుషార్ తో పాటు పలువురు చెన్నై బౌలర్లు నో బాల్స్ వేయడం కూడా ఓటమి ఓ కారణమని స్వయంగా ధోనీనే చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్ ని ఉపయోగించుకున్న చెన్నై జట్టు.. మ్యాచ్ లో గెలవడానికి బదులు అతడి వల్లే ఓడిపోయిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి సీఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్ టెక్నిక్ రివర్స్ కావడంపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
Tushar Deshpande truly making an Impact 🙏 pic.twitter.com/rfuslUQmwV
— Div🦁 (@div_yumm) March 31, 2023