CSK, IPL 2023: ఐపీఎల్ 2023లో తొలి మ్యాచ్‌లో ఓడినా.. రెండో మ్యాచ్‌లో తమ సత్తా ఏంటో చూపించింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ విజయంతో ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుని ఐపీఎల్‌లోనే నంబర్ వన్ టీమ్‌గా నిలిచింది.
ఐపీఎల్‌లో హోం గ్రౌండ్ లో మ్యాచ్ అనగానే సగం మ్యాచ్ గెలిచినంత ఫీలింగ్ వస్తుంది. అలవాటైన గ్రౌండ్ లో ఎక్కువగా ఆడడడం వలన పిచ్ మీద మంచి అవగాహన ఉండడమే కాదు.. సొంత మైదానంలో పిచ్ లను వారికి అనుకూలంగా తయారు చేసుకోవచ్చు. దీంతో ప్రత్యర్థి మీద ఆతిధ్య జట్టు ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు భారీ సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంకి వచ్చి ఆటగాళ్లను సపోర్ట్ చేస్తూ..వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. దాదాపు ప్రతి జట్టుకి సొంత మైదానంలో మంచి రికార్డే ఉంటుంది. అందులోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి సొంత గడ్డపై తిరుగులేని రికార్డ్ ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
నిన్న ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. లక్నో సూపర్ జయింట్స్ మీద విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో ఓడిపోయినప్పటికీ.. కలిసొచ్చిన చెన్నై గ్రౌండ్లో లక్నోపై చెలరేగి పోయింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ ఐపీఎల్‌లో తొలి గెలుపు నమోదు చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో చెన్నై రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అన్ని జట్లను పరిశీలిస్తే.. చెన్నై గెలుపు శాతం(72) ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో 61 మ్యాచ్ లు ఆడగా 42 మ్యాచ్ ల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. ఈ రికార్డులు చూస్తుంటే.. సొంత గడ్డపై చెన్నై ఎంత బలమైన జట్టు అనేది అర్ధం అవుతుంది.
ఇక చెన్నై టీమ్ తర్వాత ఈ లిస్టులో 68.10 శాతం విజయాలతో సన్ రైజర్స్ తర్వాతి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్(68), ముంబై ఇండియన్స్(61.90), కోల్ కత్తా నైట్ రైడర్స్(60. 80), పంజాబ్ కింగ్స్(54.30), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (50. 60), చివరగా ఢిల్లీ క్యాపిటల్స్(44.90) జట్లు నిలిచాయి. మరి సొంత గడ్డపై చెన్నై ఈ రికార్డ్ అలాగే కొనసాగిస్తుందా? లేకపోతే ఈ లిస్టులో మరొక జట్టు వచ్చి చేరుతుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chennai Super Kings has won 42 games from 61 in Chepauk.
THIS IS DOMINATION.
— Johns. (@CricCrazyJohns) April 3, 2023