ధనాధన్ లీగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అన్ని జట్లకు సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం తామే కప్పు కొడతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, చెన్నై ఫ్యాన్స్ మాత్రం వస్తున్న బ్యాడ్ న్యూస్ లు వింటూ కంగారు పడుతున్నారు. ఎందుకంటే చెన్నై జట్టుకు మరో బౌలర్ దూరమయ్యాడు.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఏజట్టు కప్పు కొడుతుందో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అన్ని జట్ల ఫ్యాన్స్ తమ టీమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఈ కాన్ఫిడెన్స్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టుకు ఈసారి దెబ్బ దెబ్బ మీద తగులుతూనే ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీషన్ గాయంతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో సౌత్ ఆఫ్రికాకి చెందిన సిండ మంగళని తీసుకున్నారు. ఎంఎస్ ధోనీ కూడా గాయం కారణంగా తొలి మ్యాచ్ కు దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ధోనీ గాయంపై మాత్రం ఎక్కడాఅధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ఇప్పుడు చెన్నై టీమ్ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో బౌలర్ జట్టుకు దూరమయ్యాడు.
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభానికి ముందే కష్టాలు చుట్టుముడుతున్నాయి. మార్చి 31న గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ అహ్మదా బాద్ వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ప్రారంభం కాకుండానే అన్నీ బ్యాడ్ న్యూస్ లు చెన్నై ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ధోనీ అందుబాటులో ఉండడనే వార్తలు అభిమానులను కలచి వేస్తుండగా.. మరో బౌలర్ దూరమయ్యాడు అంటూ చెన్నై ఫ్యాన్స్ నెత్తిన పిడుగుపడింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి సీజన్ మొత్తం జట్టుకు దూరమయ్యాడు.
Mukesh choudhary ruled out of #IPL2023 .#TATAIPL #ChennaiSuperKings #mukeshchoudary #IndianPremierLeague pic.twitter.com/KAnQQz2G8V
— FRONTAL WARRIOR🇮🇳 (@vichu24062005) March 30, 2023
భారత్ కి చెందిన ముఖేష్ చౌదరిని చెన్నై సూపర్ కింగ్స్ 2022 ఐపీఎల్ సీజన్ లో రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో మొత్తం 13 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. అతని బెస్ట్ స్టాట్స్ 4 వికెట్లకు 46 పరుగులు. అయితే అతని ఎకానమీ(9.32) మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. గతేడాది రంజీల్లో ఆడుతూ ముఖేష్ గాయం పాలయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా రెస్ట్ తీసుకున్నాడు. జనవరి నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ, చెన్నై నెట్స్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ముఖేష్ చౌదరి గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. అయితే అతని స్థానంలో చెన్నై మరో ప్లేయర్ ని ప్రకటించలేదు. చెన్నై vs గుజరాత్ మ్యాచ్ లో విజయం ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#mukeshchoudary ruled out from #IPLonStar pic.twitter.com/L4a8ixzSHE
— legenderymeme (@legenderymeme) March 30, 2023