తలా ధోనీ.. ఐపీఎల్ స్టార్ట్ కాకముందే రచ్చ లేపుతున్నాడు. జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. ధోనీ ఎంట్రీతో చెపాక్ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది.
టీమిండియాని ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు తీసుకెళ్లిన కెప్టెన్, క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అందరూ తడుముకోకుండా చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ ధోనీ. ఇతడు జట్టులోకి రాకముందు వరకు ఓ లెక్క.. వచ్చిన తర్వాత మరో లెక్క అన్నట్లు మారింది. ఎందుకంటే కెప్టెన్ గా ఎవరికీ సాధ్యం కానీ విధంగా మూడు ఐసీసీ ట్రోఫీలు భారత జట్టు సొంతమయ్యేలా చేశాడు. ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీసులో పాల్గొన్న ధోనీ.. అభిమానులందరికీ గూస్ బంప్స్ తెప్పించాడు. సోషల్ మీడియా అంతా కూడా ఇదే డిస్కషన్.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. లీగ్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటివరకు ప్రతి సీజన్ లోనూ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తోంది. నాలుగుసార్లు కప్ కూడా గెలిచింది. ఇదంతా ధోనీ వల్లే సాధ్యం. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎస్కే జట్టుకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్ ప్రారంభమైతే.. ఆ నెంబర్ ఇంకా పెరుగుతుందే తప్పితే అస్సలు తగ్గదు. కొన్నిరోజుల ముందు నుంచే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ధోనీ ప్రాక్టీసు చేస్తున్నాడు. కానీ ప్రేక్షకులకు వాటి గురించి పెద్దగా తెలియదు. తాజాగా ప్రాక్టీసు మ్యాచ్ చూసేందుకు ఆడియెన్స్ కి ఛాన్స్ ఇచ్చారు.
ఇక ప్రాక్టీసు కోసం డగౌట్ నుంచి పిచ్ పైకి ధోనీ నడుచుకుంటూ వస్తుంటే.. వెనకాల అభిమానులు, ప్రేక్షకులందరూ ధోనీ ధోనీ అని అరుస్తుంటే.. చూస్తున్న మనకే గూస్ బంప్స్ వచ్చాయంటే స్టేడియంలో కూర్చున్న వాళ్ల పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోగలం. ఇక ధోనీ అలా నడిచి వస్తుంటే.. ‘కేజీఎఫ్ 2’లో రాకీ భాయ్ ఎంట్రీలానే అనిపించిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తాజాగా వైరల్ అవుతున్నాయి. ప్రాక్టీసు మ్యాచుకే ఈ రేంజ్ క్రేజ్ అంటే.. ఇక రియల్ మ్యాచుల గురించి తలుచుకుంటుంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ధోనీ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.
The Entry of Dhoni in his KGF. pic.twitter.com/YK5d0lQhuo
— Johns. (@CricCrazyJohns) March 27, 2023