గుజరాత్ ని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి కప్ కొట్టింది. ఇది పక్కనబెడితే ఇప్పటికే ఐపీఎల్ లో ఇప్పటివరకు జరగని దాన్ని ధోనీసేన చేసి చూపించింది. సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. ఇంతకీ అదేంటి? దాని సంగతేంటి?
చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ కప్ కొట్టేసింది. ఐదోసారి విజేతగా నిలిచి ముంబయి సరసన నిలిచింది. ఇప్పటివరకు ఐపీఎల్ 16
సీజన్లు జరిగితే.. అన్ని సీజన్లు టెన్షన్ పెట్టినా సరే పెద్దగా ఇబ్బందుల్లేకుండానే జస్ట్ నాలుగైదు గంటల్లో ముగిసిపోయాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదు. ఏకంగా ఓ ఫైనల్. జస్ట్ తలో 20 ఓవర్ల మ్యాచ్. మూడు రోజులు జరిగింది. నువ్వానేనా అని దోబుచూలాడింది గానీ చివరగా గెలుపు మాత్రం ధోనీసేననే వరించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కానీ అరుదైన రికార్డుని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. చెప్పాలంటే ఓ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి పడేసింది. ప్రస్తుతం ఇదే క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ వేదికగా మే 28న ఫైనల్ అని ఎప్పుడో ఫిక్స్ చేశారు. కానీ వర్షం అనుకోని అతిథిలా రావడంతో ఆదివారం కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మ్యాచ్ ని రిజర్వ్ డే అయిన సోమవారానికి మార్చారు. మ్యాచ్ మొదలయ్యే టైమ్ కి వర్షం లేకపోవడంతో టాస్ గెలిచిన చెన్నై.. గుజరాత్ కు బ్యాటింగ్ అప్పగించింది. క్రీజులోకి వచ్చిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 214/4 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ అనే 21 ఏళ్ల కుర్రాడు 47 బంతుల్లో 96 రన్స్ కొట్టి శెభాష్ అనిపించాడు. చెన్నై ఛేదన ప్రారంభిస్తుందనేసరికి వర్షం స్టార్ట్ అయింది. కాసేపటి తర్వాత ఆగినప్పటికీ మ్యాచ్ అర్ధరాత్రి 12:10 తర్వాత మొదలైంది. అంటే మే 30తేదీన జరిగినట్లే.
వర్షం వల్ల డక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండో ఇన్నింగ్స్ ని 15 ఓవర్లకి కుదించి టార్గెట్ ని 171గా ఫిక్స్ చేశారు. చెన్నై బ్యాటర్లు తలో చేయి వేయడంతో ఈ టార్గెట్ పూర్తయింది. చెన్నై ఈసారి ఫైనల్లో విజయం సాధించింది. సాధారణంగా ఐపీఎల్ ఫైనల్లో అది కూడా బేసి సంఖ్య ఉన్న సంవత్సరాల్లో అంటే 2009, 2011, 2013, 2015, 2017, 2019, 2021 సంవత్సరాల్లో ఛేజింగ్ చేసిన ఏ జట్టు కూడా గెలవలేదు. ఇప్పుడు ఆ సెంటిమెంట్, రికార్డుని చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్ చేసింది. తాను అన్నింట్లోనూ తోపు అని ప్రూవ్ చేసుకుంది. సో అదనమాట విషయం. మరి చెన్నై ఐపీఎల్ లో ఐదోసారి కప్ కొట్టడంపై మీ ఫీలింగ్ ఏంటి? కింద కామెంట్ చేయండి.
𝙄𝘾𝙊𝙉𝙄𝘾!
A round of applause for the victorious MS Dhoni-led Chennai Super Kings 👏🏻👏🏻#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/kzi9cGDIcW
— IndianPremierLeague (@IPL) May 29, 2023