ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని మీద అభిమానం తారా స్థాయికి చేరుకుంది. ధోని బ్యాటింగ్ ఎలాగైనా చూడాలని నిన్న చిదంబరం స్టేడియంలో కంకణం కట్టుకున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని మీద అభిమానం రాను రాను ఆకాశాన్ని దాటేస్తుంది. ధోని గ్రౌండ్ లోకి రాగానే ఫ్లాష్ లైట్ లతో సందడి చేస్తూ ధోనికి ఘన స్వాగతం పలుకుతారు. మొన్నటివరకు హోమ్ గ్రౌండ్ లో సందడి చేసే అభిమానులు ఇప్పుడు మిస్టర్ కూల్ ఎక్కడికి వెళ్తే అక్కడ వాలిపోతున్నారు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ ని గమనిస్తే ఈ విషయం మనకి అర్ధం అవుతుంది. చిన్న స్వామీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ కి వస్తున్న తరుణంలో ధోని ధోని అంటూ చేసిన నినాదానికి కోహ్లీ భార్య అనుష్క శర్మ సైతం ఆశ్చర్యపోయింది. ఇక తాజాగా.. నిన్న మ్యాచులో మరోసారి ధోని జపం పాటించారు. ఈ సారి ఎందుకంటే ?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని 8 వ స్థానంలో బ్యాటింగ్ కి దిగుతున్న సంగతి తెలిసిందే. ఫామ్, ఫిట్ నెస్ ఉన్నా.. లోయర్ ఆర్డర్ లో ధోని బ్యాటింగ్ కి రావడం అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. అసలే ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని భావిస్తున్న అభిమానులు.. ఈ చివరి దశలోనైనా ధోని బ్యాటింగ్ ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నారు. టీ 20 క్రికెట్లో 6 వికెట్లు పడడం అంటే మ్యాచ్ దాదాపు చివరి వరకు వెళ్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ లైనప్ కి ధోని బ్యాటింగ్ కి రావడం సాధ్యపడడం లేదు. ఇది గమనించిన అభిమానులు ధోని బ్యాటింగ్ ఎలాగైనా చూడాలని నిన్న చిదంబరం స్టేడియంలో కంకణం కట్టుకున్నారు.
నిన్న సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై నిలకడగా ఆడుతుంది. ఇక మ్యాచ్ కాసేపట్లో అయిపోతుంది అనుకుంటున్న తరుణంలో రాయుడు ఔటయ్యాడు. ఇక కొట్టడానికి పెద్దగా పరుగులు కూడా ఏమి లేవు. ఈ దశలో అభిమానులు ధోని బ్యాటింగ్ కి చూడాలని ఆశించారు. రాయుడు ఔటవ్వగానే ధోని బ్యాటింగ్ కి రావాలని నినాదాలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం మారు మ్రోగిపోయింది. అయితే అభిమానులు ఆశించిన విధంగా ధోని బ్యాటింగ్ కి రాలేదు. మొయిన్ అలీ బ్యాటింగ్ కి బ్యాటింగ్ కి వచ్చి కాన్వేతో మ్యాచ్ ని ముగించాడు. దీతో అభిమానులకి నిరాశ తప్పలేదు. మొత్తానికి ధోని బ్యాటింగ్ కి రావడానికి చేసిన విశ్వ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.