KL Rahul: లక్నో టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేసింది. అయినా కూడా ఆ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై క్రికెట్ అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. ఇంతకీ రాహుల్ ఏం చేశాడంటే..?
ఐపీఎల్ 2023లో శుక్రవారం పరుగుల వరద పారింది. లక్నో సూపర్ జెయింట్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 458 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్ అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్ 54, కుర్రాడు ఆయూష్ బదోని 43, స్టోయినీస్ 72, పూరన్ 45 పరుగులతో దుమ్మురేపారు. వీరి దెబ్బకు ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్ నమోదు అయింది.
పంజాబ్ సైతం బాగానే పోరాడి 19.5 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో లక్నో 56 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం మధ్య సాగిన ఈ మ్యాచ్ తర్వాత.. కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇదీ మా బ్యాటింగ్ బలం’ అని పేర్కొన్నాడు. అయితే.. రాహుల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో రాహుల్ కేవలం 12 పరుగులు చేశాడు. 9 బంతులాడిన రాహుల్.. ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ఘిక్క రాహుల్ మినహా ఇస్తే.. క్రీజ్‌లోకి వచ్చిన ప్రతి బ్యాటర్ దాదాపు 200 స్ట్రైక్‌రేట్‌తో ఆడారు.
దీంతో రాహుల్‌పై క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఈ భారీ స్కోర్‌లో నీ కాంట్రిబ్యూషన్‌కు, నువ్వు ఇచ్చే స్టేట్‌మెంట్‌కు ఏమైనా సంబంధం ఉందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. పైగా ఈ సీజన్‌లో రాహుల్ పెద్దగా ఫామ్‌లో లేని విషయం తెలిసిందే. కాగా.. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతోంది. అయితే.. టీమ్ పరంగా లక్నో బాగానే ఆడుతున్నా.. కెప్టెన్ రాహుల్ ప్రదర్శన మాత్రం దారుణంగా ఉంది. మరి తర్వాతి మ్యాచ్‌ల్లోనైనా తన బ్యాట్ ఝుళిపించి రాహుల్ సత్తా చాటుతాడో లేదో చూడాలి. మరి ఈ మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్‌తో పాటు రాహుల్ వ్యాఖ్యలపైనా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Looking at how Lucknow scored 200 in 16 overs, other IPL teams has taken a note that the best strategy against LSG is to not get KL Rahul out early. #LSGvsPBKS pic.twitter.com/VbvE64yuZ7
— EngiNerd. (@mainbhiengineer) April 28, 2023