ధనా ధన్ లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ, ముంబై ఫ్యాన్స్ మాత్రం సగం మ్యాచుల్లే ఆడతానంటూ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సగం సగం పనులు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2023కు టాస్ పడనుంది. ఈ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అన్ని జట్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాయి. అయితే.. ఈ సీజన్ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన చేశాడు. రోహిత్ ముంబై ఇండియన్స్ కు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. కానీ, ఈ సీజన్లో మాత్రం సగం మ్యాచులు మాత్రమే ఆడతానంటూ ప్రకటించాడు. రోహిత్ శర్మ చేసిన ప్రకటనతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అంతా తెల్లముఖాలు వేశారు.
గతేడాది ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ కి ఒక పీడకల అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. గతేడాది చేదు అనుభవాలకు ఈసారి గట్టి సమాధానం చెబుతారంటూ ముంబై ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ, రోహిత్ శర్మ తాను సగం మ్యాచ్ లు ఆడనని.. తాను లేని మ్యాచ్ లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ వస్తున్న నేపథ్యంలో కాస్త పనిభారం తగ్గించుకోవాలని రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. అయితే ఇప్పుడు ఆ నిర్ణయంతో ఫ్యాన్స్ నుంచి రోహిత్ శర్మ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
The 💙 huddle! 😍#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL pic.twitter.com/uLPlee4FTv
— Mumbai Indians (@mipaltan) March 30, 2023
అవును.. రోహిత్ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ సగం సగం పనులు చేస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ గా వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్స్ కోసం ఐపీఎల్ కు దూరమవుతున్నాను అని ప్రకటించి ఉన్నట్లయితే అభిమానులు తప్పకుండా సంతోషించేవారు. ఎందుకంటే ఐపీఎల్ కంటే తనకు టీమిండియా విజయమే ముఖ్యమని చెప్పాడు కాబట్టి. కానీ, ఇలా సగం సగం మ్యాచులు ఆడటాన్ని తప్పుబటుతున్నారు. ఇటు ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ఆనందంగా లేరు. పైగా ఆడిన మ్యాచ్ లో ఏదైనా గాయం అయితే ఏంటి పరిస్థితి? అప్పుడు వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ కూడా పోతుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
𝙎𝙆𝙔 चा 𝘾𝙤𝙫𝙚𝙧 𝘿𝙧𝙞𝙫𝙚 🤌#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/yYewgZOikL
— Mumbai Indians (@mipaltan) March 30, 2023