IPL 2023: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఇలాంటి లీగ్‌లో అంపైరింగ్ ఎలా ఉండాలి? ఎవరూ వేలెత్తి చూపించకుండా ఉండాలి? కానీ.. ప్రస్తుతం జరుగుతున్న తప్పిదాలు చూస్తుంటే ఇదేం చెత్త అంపైరింగ్ అని మినిమమ్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు కూడా అనే పరిస్థితి ఉంది.
క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే ఓ పెద్ద పండుగ సీజన్. రెండు నెలల పాటు క్రికెట్ మజాను ఆస్వాదిస్తుంటారు. అయితే.. ఈ సీజన్ కూడా క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదం అందిస్తున్నా.. కొన్ని విమర్శలను సైతం మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా అంపైర్లు తీసుకునే తప్పుడు నిర్ణయాలపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన రెండు సంఘటనలు అయితే.. అసలు ఇది అంపైరింగ్ అంటారా? అనేలా ఉన్నాయంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంత చెత్త అంపైరింగ్‌ను గల్లీ క్రికెట్‌లో కూడా చూడలేం అంటూ సైటైర్లు వేస్తున్నారు.
క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కారణం ఏంటంటే? చెన్నై-పంజాబ్ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ విజయానికి 10 బంతుల్లో 15 రన్స్ అవసరమైన దశలో తుషార్ దేశ్‌పాండే వేసిన 19వ ఓవర్‌లో జితేష్ శర్మ లాంగ్ ఆన్ దిశగా ఆడిన భారీ షాట్‌ను సీఎస్‌కే ఫీల్డర్ రషీద్ ఖాన్ క్యాచ్‌గా అందుకున్నాడు. ఆ సమయంలో అతని కాలు బౌండరీ లైన్‌కు తాకినట్లు రీప్లేలో కనిపిస్తోంది. కానీ.. బౌండరీ రోప్‌లో కదలిక లేదనే కారణంతో అంపైర్ దాన్ని అవుట్‌గా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. చెన్నైకి ఫేవర్‌గా నిర్ణయం తీసుకున్నారంటూ క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. అయితే.. మ్యాచ్ పంజాబ్ గెలవడంతో ఆ వివాదం అక్కడితో సమసిపోయింది. కానీ, అంపైర్ నిర్ణయంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే.. రాజస్థాన్-చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ కూడా ఒక విషయంపై తీవ్ర వివాదం రాజుకుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ కాలేదంటూ అయినా అంపైర్ అవుట్ ఇచ్చాడంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. బాల్ వికెట్లకు తాకలేదని, వికెట్ కీపర్ సంజు శాంసన్ గ్లౌజ్‌లు బెయిల్స్‌ను తాకాయని.. రీప్లేలో క్లియర్‌గా తెలుస్తున్నా.. అంపైర్ అవుటిచ్చాడంటూ.. ఇంత పెద్ద లీగ్‌లో, ఇంత నూతన టెక్నాలజీ ఉన్నా కూడా ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు జరగడం దారుణమంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. అంపైర్ల తప్పిదాలు రోజురోజుకు మించిపోతున్నాయని, ఈ తప్పిదాలే ఐపీఎల్‌పై ఫిక్సింగ్ ఆరోపణలకు కారణంగా అవుతున్నాయని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma was not out. pic.twitter.com/BnUc4OwwSA
— MI Fans Army™ (@MIFansArmy) April 30, 2023