ఐపీఎల్ లో టీంఇండియా ప్లేయర్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు కోహ్లీకి గాయమైందని తెలుస్తుంది. అయితే తాజాగా..కోచ్ సంజయ్ బంగర్.. కోహ్లీ గాయం విషయంలో కోచ్ సంజయ్ బంగర్ క్లారిటీ ఇచ్చేసాడు.
ఐపీఎల్ లో టీంఇండియా ప్లేయర్లను గాయాలు వేధిస్తున్నాయి. గాయాల ధాటికి ఒకొక్కరు సర్జరీలు చేపించుకుంటూ.. నెలల తరబడి అంతర్జాతీయ మ్యాచులకి దూరం అవుతున్నారు. ఈ లిస్టు తీస్తే చాలా మంది భారత ప్లేయర్లు కనిపిస్తారు. అయితే ఇదిలా ఉండగా.. ఇప్పుడు విరాట్ కోహ్లీకి గాయమైందని తెలుస్తుంది. ఇప్పుడు అభిమానులతో పాటుగా, అందరిని ఈ ప్రశ్న ఆందోళనకి గురి చేస్తుంది. మరో రెండు వారాల్లో డబ్ల్యూటీసి ఫైనల్ ఉన్న నేపథ్యంలో కోహ్లీ గాయపడితే టీమిండియా పరిస్థితి ఏంటి? అనే విషయంలో అందరూ సతమతమవుతున్నారు. అయితే తాజాగా..కోచ్ సంజయ్ బంగర్.. కోహ్లీ గాయం విషయంలో కోచ్ సంజయ్ బంగర్ క్లారిటీ ఇచ్చేసాడు.
ఐపీఎల్ లో భాగంగా నిన్న గుజరాత్ జట్టుతో ఆర్సీబీ తన చివరి లీగ్ మ్యాచ్ ని ఆడేసింది. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో ఈ మ్యాచులో ఆర్సీబీ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. వైశుక్ బౌలింగ్ లో విజయ్ శంకర్ క్యాచ్ అందుకునే క్రమంలో కోహ్లీ డైవ్ చేసాడు. దీంతో కోహ్లీ మోకాలికి గాయమైంది. దీంతో కాసేపు నొప్పితో విలవిల్లాడింది కోహ్లీ.. మైదానాన్ని వీడాడు. దీంతో కోహ్లీ గాయం ఇప్పుడు అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
ఇప్పుడు గాయం విషయంలో కోచ్ బంగర్ మాట్లాడుతూ”కోహ్లీ గాయం తీవ్రమైనది కాదు. ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడు. బిజీ షెడ్యూల్ వలన అలసిపోయాడు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది” అని తెలిపాడు. ఇక ఏ మ్యాచులోకొహ్లి సెంచరీ కొట్టినా.. ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది. దీంతో కప్ కొట్టాలనే ఆర్సీబీ ఆశలకు నిరాశే ఎదురైంది. మొత్తానికి కోహ్లీకి గాయం తీవ్రత లేదని అర్ధం అవుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.