ఐపీఎల్ 2023లో హోరా హోరీ మ్యాచ్ కు తెరలేవనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై-హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఇప్పడు పరిశీలిద్దాం.
IPL 2023 16వ సీజన్ ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ మజాను పంచుతోంది. ప్రతి మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠతను రేకెత్తిస్తూ.. ముందుకు సాగుతున్నాయి. ఇక కొన్ని జట్లు వరుస విజయాలతో దుసుకెళ్తుంటే.. మరికొన్ని టీమ్స్ మాత్రం పరాజయాలతో చతికిలపడుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 29వ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో? ఏ టీమ్ బలంగా ఉంది, ఏ జట్టు బలహీనంగా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సూపర్ ఫామ్ లో ఉంది. తొలుత రెండు మ్యాచ్ ల్లో ఒడిపోయినప్పటికీ.. ఆ తర్వాత పుంజుకుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో 3 విజయాలు 2 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిస్టర్ కూల్ ధోని నాయకత్వంలో చెన్నై అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ లో డెవాన్ కాన్వే, గైక్వాడ్, రహానే, దుబే, మెుయిన్ అలీ, స్టోక్స్, జడేజా, ధోనిలతో శత్రుదుర్భేద్యంగా ఉంది. అయితే కాన్వే రాణిస్తున్నప్పటికీ మిగత బ్యాటర్లు అనుకుంతగా రాణించడం లేదు. రహానే స్పీడ్ గా రన్స్ చేస్తున్నాడు, అయితే ఆ పరుగులను భారీ స్కోర్ గా మలచడంలో విఫలం అవుతూ వస్తున్నాడు. మెుయిన్ అలీ, జడేజా, ధోని, స్టోక్స్ నుంచి ఇప్పటి వరకు ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా రాలేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. మెుయిన్ అలీ, జడేజా, తుషార్ దేశ్ పాండే, మహేష్ తీక్షణ, పతిరనా లు అద్భుతంగా రాణిస్తున్నారు.
2023 ఐపీఎల్ ట్రోఫీని ఎలగైనా దక్కించుకోవాలని అనుకుంటున్న కావ్యా పాపకు ఈసారి కూడా నిరాశే ఎదురౌతుంది. ఈ సీజన్ లో ఆడిన 5 మ్యాచ్ ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి 3 అపజయాలను మూటగట్టుకుంది. దాంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. దాంతో చెన్నైతో జరిగే మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటోంది హైదరాబాద్. అయితే ఆ జట్టు నిండా లోపాలే కనిపిస్తున్నాయి. జట్టులోని ఆటగాళ్లలో నిలకడలేకపోవడం టీమ్ కు ప్రధాన సమస్యగా మారింది. భారీ ధరకు అమ్ముడు పోయిన హ్యారీ బ్రూక్ ఒకే ఒక్క మ్యాచ్ లో సెంచరీతో తన ప్రతాపాన్ని చూపాడు. ఇక రాణిస్తారు అనుకున్న మయాంక్ అగర్వాల్, అయిడెన్ మార్క్ రమ్, క్లాసెన్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సుందర్ లు చేతులు ఎత్తేస్తున్నారు. బౌలర్లు భారీ స్కోర్లను కూడా కాపాడుకోలేక పోతున్నారు. ప్రతి మ్యాచ్ లో బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా విఫలం అవుతూ వస్తున్నారు.
డెవాన్ కాన్వే, గైక్వాడ్, రహానే, శివమ్ దుబే, మెుయిన్ అలీ/స్టోక్స్, జడేజా, ధోని, తుషార్ దేశ్ పాండే, మహేష్ తీక్షణ, మతీషా పతిరన, ఆకాశ్ సింగ్
హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, త్రిపాఠీ, అయిడెన్ మార్క్ రమ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మయాంక్ మార్కండే
ప్రెడిక్షన్: రెండు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.