ఐపీఎల్ లో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ దూసుకెళ్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా.. ఇప్పుడు కొత్తగా ధోని అండ్ కో ఒక కొత్త రికార్డ్ సృష్టించి టాప్ లో నిలిచింది. ఈ లిస్టులో చెన్నై తో పాటుగా బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు కూడా టాప్ 5లో స్థానం సంపాదించి ఐపీఎల్ సత్తా చూపించాయి.
ఐపీఎల్ లో టాప్ టీమ్స్ అంటే ఠక్కున గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు. ధోని, కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లకు దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు కెప్టెన్లు గా ఉన్న జట్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. ఈ జట్లు కేవలం దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయమే. అందుకే ఐపీఎల్ లో ఎన్ని జట్లు ఉన్నా ఈ మూడు జట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఈ మూడు జట్లలో ఏ రెండు జట్లు తలపడిన స్టేడియం నిండిపోవడం ఖాయం. ఇప్పుడు వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఒక ప్రధాన కారణముంది.
ఐపీఎల్ లో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ దూసుకెళ్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా.. ఇప్పుడు ధోని అండ్ కో ఒక రికార్డ్ సృష్టించింది. క్రీడల్లో ఆసియాలోనే టాప్ ఫాలోయింగ్ కలిగిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఆసియాలో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఫుట్ బాల్ టీమ్స్ కూడా చెన్నై ధాటికి వెనక్కి వెళ్లిపోవడం విశేషం. ట్విట్టర్లో మార్చ్ నెలలో 512 మంది ఫాలోవర్లతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ లిస్టులో చెన్నై తో పాటుగా బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు కూడా టాప్ 5లో స్థానం సంపాదించి ఐపీఎల్ సత్తా చూపించాయి
ఆర్సీబీ345 మిలియన్, ముంబై ఇండియన్స్ 274 మంది ఫాలోవర్లతో వరుసగా మూడు నాలుగు స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ లిస్టులో ఫుట్ బాల్ క్లబ్ అల్ నజీర్ 500 మిల్లియన్ లతో రెండవ స్థానంలో ఉంది. మొత్తానికి ఐపీఎల్ అంటే దేశంలోనే కాదు ఆసియా వ్యాప్తంగా పాపులారిటీ సంపాదుంచుకోవడం నిజంగా విశేషమే. క్రికెట్ లో అంటే ఎలాగూ టాప్ లో ఉంటుంది అని అందరికీ తెలిసినా.. క్రీడల విభాగంలో టాప్ 5 లో మూడు మన ఐపీఎల్ జట్లే ఉండడం ఈ లీగ్ క్రేజ్ ని తెలియజేస్తుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కి ధోని ఇదే చివరి ఐపీఎల్ అని హింట్ ఇచ్చిన తరుణంలో మహేంద్రుడు ఎక్కడ ఉంటే ఫ్యాన్స్ అక్కడ వాలిపోతున్నారు. మొత్తానికి ఈ విషయం చెన్నై అభిమానులకి తెలిస్తే పండగే. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.