గత రెండు నెలలుగా అభిమానులని అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ సీజన్ 16 ముగింపు దశకు చేరుకుంది.ఇందులో భాగంగా నేడు డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్ 1 లో తలపడనుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ ముందు ధోని సేనను ఒక సెంటిమెంట్ టైటిల్ మీద ఆసక్తిని కలిగిస్తుంది.
గత రెండు నెలలుగా అభిమానులని అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ సీజన్ 16 ముగింపు దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో నాలుగు మ్యాచులతో ఈ ఆదివారం ఐపీఎల్ ముగుస్తుంది. మంగళవారం క్వాలిఫయర్ 1, బుధవారం ఎలిమినేటర్, శుక్రవారం క్వాలిఫయర్ 2 మిచ్లతో పాటు ఆదివారం గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ఇందులో భాగంగా నేడు డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్ 1 లో తలపడనుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచులో ధోని సేన హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ ముందు ధోని సేనను ఒక సెంటిమెంట్ టైటిల్ మీద ఆసక్తిని కలిగిస్తుంది.
ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కి వెళ్లడమంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మంచి నీళ్లు తాగినంత పనిలా అనిపిస్తుంది. ఇప్పటివరకు 14 ఐపీఎల్ సీజన్ లో చెన్నై ఏ జట్టుకి సాధ్యం కాని విధంగా 12 సార్లు ప్లే ఆఫ్ కి వెళ్లి ఐపీఎల్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ప్లే ఆఫ్ రికార్డ్ ఒకటి చెన్నై విజేతగా చెబుతుంది. ఇప్పటివరకు చెన్నై 6 సార్లు క్వాలిఫయర్ మ్యాచులాడితే అందులో నాలుగు సార్లు విజయం సాధించింది. మరో రెండో మ్యాచులు ఓడిపోయింది. ఇక క్వాలిఫయర్ 1 గెలిచిన ఈ నాలుగు మ్యాచుల్లో మూడు సార్లు టైటిల్ గెలిచింది.
2011,2013, 2018, 2021 లో నాలుగు సార్లు చెన్నై క్వాలిఫయర్ 1 ఆడగా.. వీటిలో ఒక్క 2013 ని మినహాయిస్తే.. మిగిలిన మూడు సార్లు ట్రోఫీ గెలిచింది. ఓడిన ఆ ఒక్క మ్యాచ్ ముంబై ఇండియన్స్ మీద కావడం గమనార్హం. ప్రస్తుతం క్వాలిఫయర్ 1 లో ముంబై లేదు కాబట్టి చెన్నై గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అదేవిధంగా మరోసారి క్వాలిఫయర్ 1 లో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి చెన్నై మరోసారి టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.