రాజస్థాన్ పై ఓడిపోయి బాధలో ఉన్న చెన్నైకి మరో షాక్ తగిలింది. దాంతో చెన్నై జట్టు డేంజర్ లో పడబోతుందా? అన్న న్యూస్ ఇప్పుడు సీఎస్కే ఫ్యాన్స్ ను ఆందోళన పెడుతోంది. ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో ఓన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ జట్టుగా మంచి ట్రాక్ రికార్డును క్రియేట్ చేసుకుంది. నాలుగు ఐపీఎల్ టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకుని.. ఐదో టైటిల్ కోసం వేట కొనసాగిస్తోంది. ఐపీఎల్ జట్లలో నిలకడగా విజయాలు సాధించే జట్లలో చెన్నై ముందు వరుసలో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇందుకు నిదర్శనం ఐపీఎల్ లో చెన్నై సాధించిన గణాంకాలే. ఎక్కువ ఫైనల్లోకి ప్రవేశించిన జట్టుగా, ఎక్కువ ప్లే ఆఫ్ కు చేరిన జట్టుగా, హయ్యోస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న జట్టుగా పలు రికార్డులను చెన్నై తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇంతటి ఘనత సాధించిన చెన్నై.. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో కష్టాలను ఎదుర్కొంటోంది. నాలుగు మ్యాచ్ ల్లో రెండు విజయాలు, రెండు పరాజయాలతో 4 పాయింట్స్ సాధించి ఐదో స్థానంలో నిలిచింది. ఇక తాజాగా రాజస్థాన్ పై ఓడిపోయి బాధలో ఉన్న చెన్నైకి మరో షాక్ తగిలింది. దాంతో చెన్నై జట్టు డేంజర్ లో పడబోతుందా? అన్న న్యూస్ ఇప్పుడు సీఎస్కే ఫ్యాన్స్ ను ఆందోళన పెడుతోంది. ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ అనగానే మనకు కొన్ని జట్ల పేర్లు మైండ్ లో తళుక్కున మెరుస్తాయి. అందులో కచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉంటుంది. అలాంటి జట్టుకు ఐపీఎల్ 2023లో గడ్డుకాలం నడుస్తోంది. ఈ సీజన్ లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో రెండు విజయాలు, రెండు అపజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఐపీఎల్ టైటిల్ ను సాధించి ధోనికి బహుమతిగా ఇవ్వాలని చెన్నై టీమ్ భావిస్తోంది. ఎందుకంటే ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని అంతా అనుకుంటున్నారు. అయితే ఈసారి చెన్నై ఐపీఎల్ టైటిల్ ను సాధించడం కష్టమే అనిపిస్తోంది. దానికి బలమైన కారణాలు లేకపోలేదు. ప్రధానంగా చెన్నై జట్టు గాయాలతో సతమతం అవుతోంది.
ఇప్పటికే స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా రెండు, మూడు వారాలు టోర్నీకి దూరం అయిన సంగతి తెలిసిందే. అతడితో పాటుగా బెన్ స్టోక్స్, ధోని, సిమర్జిత్ సింగ్ లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. సిమర్జిత్ సింగ్ కొన్ని వారాల పాటు జట్టకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇక తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా స్టార్ బౌలర్ సిసండ మగళ గాయపడ్డాడు. దాంతో అతడు రెండు వారాల పాటు జట్టుకు దూరం కానున్నాడు. చెన్నై జట్టుకు సిసిండా కీలక బౌలర్ గా సేవలందిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు గాయపడటంతో జట్టు మరింతగా బలహీనపడింది. ఇక ధోని, బెన్ స్టోక్స్ సైతం రోజూవారిగా చెకప్ చేయించుకుంటూ.. బరిలోకి దిగుతున్నట్లు కోచ్ ప్లెమింగ్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. మరి గాయాలతో ఇబ్బంది పడుతున్న సీఎస్కే టీమ్ వాటిని అధిగమించి.. ఐపీఎల్ టైటిల్ కొట్టగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.