ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో విజయవంతమైన జట్లు. ఈ రెండు జట్లు కూడా 9 టైటిళ్లు గెలిచి మరో టైటిల్ రేస్ లో ఉన్నాయి. అంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ చెన్నై, ముంబై జట్లను ఆందోళనకు గురి చేస్తుంది.
ఐపీఎల్-2023 చివరి దశకు వచ్చేసింది. మార్చ్ 31 న మొదలైన సీజన్ 16 ఐపీఎల్.. నిన్న ఆదివారంతో లీగ్ మ్యాచులన్నీ ముగిసిపోయాయి. మరోవారంతో ప్లే ఆఫ్ మ్యాచులు కూడా ముగియనున్నాయి. ఇప్పటివరకు జరిగిన 70 మ్యాచులు అభిమానులకి కావాల్సినంత వినోదాన్ని పంచగా.. ఇప్పుడు ఈ వినోదాన్ని రెట్టింపు చేయడానికి ప్లే ఆఫ్ మ్యాచులు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగా టాప్ 2లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రేపు క్వాలిఫయర్ 1 ఆడేందుకు సిద్ధపడితే..ఆ తర్వాత రోజు లక్నో సూపర్ జయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక శుక్రవారం క్వాలిఫయర్ 2, అదేవిధంగా ఆదివారం ఫైనల్ జరగనుంది. అయితే ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ చెన్నై, ముంబై జట్లను ఆందోళనకు గురి చేస్తుంది.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో విజయవంతమైన జట్లు. ఈ రెండు జట్లు కూడా 9 టైటిళ్లు గెలిచి మరో టైటిల్ రేస్ లో ఉన్నాయి. వీటిలో ముంబై 5 సార్లు, చెన్నై 4 సార్లు ఛాంపియన్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మరో టైటిల్ కూడా వీరి ఖాతాలో పడతుందని అందరు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్క సారి కూడా చెన్నై.. గుజరాత్ మీద, ముంబై లక్నో మీద గెలవకపోవడం గమనార్హం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ రెండు కొత్త జట్ల మధ్య గత రికార్డులని పరిశీలిస్తే ఒక్క గెలుపు కూడా నమోదు చేయకపోవడం విశేషం. ఈ రికార్డ్ ప్రస్తుతం ఈ రెండు జట్ల అభిమానులను టెన్షన్ పడుతుంది.
ఇప్పటివరకు ముంబై, లక్నో 3 సార్లు తలపడగా 3 సార్లు లక్నోనే విజయం వరించింది. ఇక గుజరాత్ చెన్నై జట్ల మధ్య చూసుకుంటే చెన్నై కూడా ఆడిన మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది. అయితే ఇప్పటివరకు.. చెన్నై-గుజరాత్, ముంబై-లక్నో జట్లు ప్లే ఆఫ్ లో ఎదురవ్వలేదు. అయితే ఛాంపియన్ ఐన ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్ ఎలా ఆడాలో బాగా తెలుసు. పైగా జట్టులో కావాల్సినంత అనుభవం కూడా ఉంది. ప్లే ఆఫ్ రికార్డ్ చూసుకుంటే మాత్రం చెన్నై, ముంబై ఓడిపోవడం దాదాపు అసాధ్యం. ఇదే జరిగితే హోరా హోరా పోరు ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి సెంటిమెంట్ ప్రకారం ఈ రెండు జట్లు మరోసారి ఓడిపోతాయా? లేకపోతే కీలకమైన ప్లే ఆఫ్ లో తమ ఛాంపియన్ పవర్ చూపిస్తాయో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.