ఐపీఎల్ అంటే బ్యాటర్లే కాదు బౌలర్లను కూడా కాస్త గుర్తించండి అని చెప్పకనే చెప్పాడు ఒక బౌలర్. ప్రస్తుతం ఐపీఎల్ లో బాగా బౌలింగ్ చేస్తున్న ఒక బౌలర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అదరగొడుతుంది. వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. అయితే ముంబై ఇండియన్స్ విజయాలు సాధిస్తుందంటే దానికి ప్రధాన కారణం బ్యాటర్లే అని చెప్పాలి. బౌలర్లు విఫలమైన ప్రతిసారి బ్యాటర్లే జట్టుకి అండగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా.. ముంబై జట్టులో ఒక సీనియర్ బౌలర్ సత్తా చాటుతున్నాడు. ప్రతి మ్యాచులో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా.. నిలకడగా వికెట్లు తీస్తూ జట్టుకి పెద్ద దిక్కులా మారాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు భారత మాజీ సీనియర్ బౌలర్ పీయూష్ చావ్లా. ఏ సీజన్ లో చావ్లా బాగా బౌలింగ్ చేసినా.. బౌలర్లకు విలువలేదు అనే వ్యాఖ్యలు చేయడం విశేషం.
“పీయూష్ చావ్లా” ఐపీఎల్ సీనియర్ బౌలర్లలో ఒకడు. ఇప్పటివరకు చాలా మ్యాచుల అనుభవం ఉన్న చావ్లా.. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు. త్వరలో బ్రావో రికార్డ్ బద్దలు కొట్టి రెండో స్థానానికి రావడం గ్యారంటీ. ఇక ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ 12 మ్యాచులాడిన ఈ లెగ్ స్పిన్నర్ 19 వికెట్లతో తన విలువెంతో జట్టుకి తెలియజేశాడు. ఓ వైపు ఇక సహచర బౌలర్లు విఫలమవుతున్నా.. చావ్లా మాత్రం ప్రతి మ్యాచులో రాణించి ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. పీయూష్ చావ్లాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
“నా ఏడేళ్ల కొడుకు ప్రతి క్రికెట్ మ్యాచ్ చూస్తాడు. నేనేమో నువ్వు బౌలర్ వి కావాలని అనుకోకు అని చెబుతా. అతడు బంతిని ముట్టుకుంటే ఆ చేతిని కొడతా. ఎందుకంటే అతడు బ్యాటర్ కావాలనేది నా కోరిక. అందుకే శిక్షణ కూడా ఇప్పిస్తున్నాను. నెట్స్ లో కూడా నేనే బౌలింగ్ వేస్తాను. నేను ఇప్పుడు ఐపీఎల్ ఓ బౌలింగ్ చేస్తున్నందుకు 50 లక్షలు ఇస్తున్నారు. అతడు మంచి బ్యాటర్ గా మారితే రానున్న 10 ఏళ్లలో 20 కోట్లయినా ఇస్తారు. నా కొడుకు కోసం ఒక 20 కోట్లు పక్కన పెట్టాలని ముంబై ఇండియన్స్ కి చెప్పాను”పీయూష్ చావ్లా ఈ విషయాలు మాట్లాడినట్టు అశ్విన్ ఒక యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు. మొత్తానికి బాగా బౌలింగ్ వేస్తున్న చావ్లాని ముంబై ఇండియన్స్ సరిగ్గా పట్టించుకోవడం లేదో లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Piyush Chawla in IPL 2023:
4-0-26-0
4-0-33-1
4-0-22-3
4-0-19-1
4-0-43-2
3-0-15-2
4-0-34-2
4-0-34-2
4-0-29-2
4-0-25-2Leading wicket-taker for Mumbai Indians with 17 wickets – A Comeback to remember. pic.twitter.com/YfuBpve6HF
— Johns. (@CricCrazyJohns) May 6, 2023