ఒక బౌలర్ అద్బుతమైన ప్రదర్శన చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదే బౌలర్ పదే పదే ఒకే ప్రత్యర్థి మీద ఆధిపత్యం చూపిస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ బౌలర్ ఎవరో కాదు రాజస్థాన్ స్పిన్నర్ చాహల్. ఈ లెగ్ స్పిన్నర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేకపోయినా.. ప్రస్తుతం కేకేఆర్ జట్టు మీద చాహల్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక బౌలర్ అద్బుతమైన ప్రదర్శన చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒకే బౌలర్ పదే పదే ఒకే ప్రత్యర్థి మీద ఆధిపత్యం చూపిస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ బౌలర్ ఎవరో కాదు రాజస్థాన్ స్పిన్నర్ చాహల్. ఈ లెగ్ స్పిన్నర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేకపోయినా.. ప్రస్తుతం కేకేఆర్ జట్టు మీద చాహల్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
“యుజ్వేంద్ర చాహల్” ఈ పేరు తెలియని వారు, ఈ స్పిన్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ టాప్ బౌలర్లతో పోలిస్తే చాహల్ కాస్త వెనకంజలో ఉన్నట్లుగా అర్ధం అవుతుంది. టాలెంట్ కావాల్సినంత ఉన్నప్పటికీ.. ఈ లెగ్ స్పిన్నర్ కి కావాల్సిన గుర్తింపు రాలేదు. 2014 లో తొలిసారి ఐపీఎల్ లో అడుగు పెట్టిన చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. ఈ పదేళ్లలో బెంగళూరు, రాజస్థాన్ జట్లకు ఆడి దాదాపు ప్రతి సీజన్లో 20 కి పైగా వికెట్లు తీసుకుంటూ వచ్చాడు. చాహల్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేకపోయినా.. ప్రస్తుతం కేకేఆర్ జట్టు మీద చాహల్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రస్తుతం ఐపీఎల్ లో చాహల్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచులో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలో బ్రావో రికార్డ్ బ్రేక్ చేసి ఐపీఎల్ లోనే అత్యధిక వికెట్లు(187) తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డ్ సంగతి పక్కన పెడితే.. చాహల్ ఐపీఎల్ లో కేకేఆర్ టీం మీద కంప్లీట్ గా డామినేట్ చేస్తున్నాడు. ఒక బౌలర్ ఒకే ప్రత్యర్థి మీద ఈ రేంజ్ లో చెలరేగి వికెట్లు తీయడం చాహల్ కే సాధ్యమైంది. కేకేఆర్ మీద అతని గుణకాలు చూస్తే వామ్మో అనాల్సిందే.
చాహల్ ఐపీఎల్ ప్రయాణం 2014 లో తొలిసారి కోల్ కత్తా మీద ఆడాడు. తన కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు(5/40) నమోదు చేసింది కూడా కేకేఆర్ మీద కావడం విశేషం. ఇక ఐపీఎల్ లో చాహల్ తీసిన హ్యాట్రిక్ కూడా కేకేఆర్ మీదే కావడం గమనార్హం. కేకేఆర్ అంటే రెచ్చిపోయి ఆడే చాహల్ నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచులో కూడా కేవలం 25 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ లో ఇక నితీష్ రానా వికెట్ తీసిన చాహల్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచులో చాహల్ తో పాటు బ్యాటింగ్ లో జైస్వాల్ కూడా విరుచుకుపడడంతో రాజస్థాన్ కి భారీ విజయం సాధించింది. మొత్తానికి కేకేఆర్ బౌలర్ల మీద చాహల్ ఇలా ఆధిపత్యం చూపించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.