పంజాబ్- రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు యంగ్ ప్లేయర్ ప్రభ్ సిమ్రన్ సింగ్. ఇక ప్రమాదకరంగా మారుతున్న ప్రభ్ సిమ్రన్ ను స్టన్నింగ్ క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు బట్లరు. ప్రస్తుతం బట్లర్ పట్టిన క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2023 అభిమానులను అలరిస్తూ.. ముందుకు సాగుతోంది. రోజురోజుకు మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. బ్యాటర్లు బ్యాట్ తో రెచ్చిపోతుంటే.. బౌలర్లు తమ మాయాజాలాన్ని చూపిస్తున్నారు. ఇక ఫీల్డర్స్ తమ మెరుపు ఫీల్డింగ్ తో బ్యాటర్ల ఆట కట్టిస్తున్నారు. తాజాగా పంజాబ్- రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు యంగ్ ప్లేయర్ ప్రభ్ సిమ్రన్ సింగ్. అతడు కేవలం 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 60 పరుగులు చేసి బట్లర్ పట్టిన కళ్లు చెదిరి క్యాచ్ కు పెవిలియన్ చేరాడు. మంచి ఊపు మీదున్న ప్రభ్ సిమ్రన్ ను బోల్తా కొట్టించాడు హోల్డర్.
ఐపీఎల్ 2023 లో భాగంగా బుధవారం(ఏప్రిల్ 5)న గౌహతి వేదికగా రాజస్థాన్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్. దాంతో పంజాబ్ బ్యాటింగ్ కు దిగింది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్స్ లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే 28 బంతుల్లోనే టోర్నీలో తన తొలి అర్ద శతకాన్ని నమోదు చేసుకున్నాడు.ఈ క్రమంలోనే 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 60 పరుగులు చేసి మంచి ఊపు మీదున్నాడు ప్రభ్ సిమ్రన్ సింగ్. ఈ యంగ్ ప్లేయర్ దూకుడు చూస్తే.. శతకం కచ్చితంగా బాదడం ఖాయం అని చూసే ప్రేక్షకులు సైతం అనుకునే ఉంటారు. అంతలా అతడు బౌలర్లను ఉతికి ఆరేశాడు మరి.
ఇక ప్రమాదకరంగా మారుతున్న ప్రభ్ సిమ్రన్ ను అద్భుతమైన స్లో డిలివరీతో బోల్తా కొట్టించాడు హోల్డర్. భారీ షాట్ కు ప్రయత్నించిన ప్రభ్ సిమ్రన్.. లాంగ్ ఆఫ్ లో ఉన్న బట్లరు ఉరికొచ్చి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో దూకుడు మీదున్న యంగ్ ప్లేయర్ పెవిలియన్ బాట పట్టాడు. బట్లర్ డైవ్ చేస్తూ.. పట్టిన అద్భుతమైన క్యాచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కెప్టెన్ శిఖర్ ధావన్ 36 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్ తో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. భానుక రాజపక్స(1) రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. జితేశ్ శర్మ (17) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతానికి పంజాబ్ స్కోర్ 14 ఓవర్లకు 140/1తో ఉంది.
A brilliant catch by Jos Buttler to dismiss dangerous looking Prabhsimran! 😯#RRvPBKS #TATAIPL #IPL2023 #Cricket #JosButtler pic.twitter.com/JhoBXU3OId
— OneCricket (@OneCricketApp) April 5, 2023