సన్ రైజర్స్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో అరుదైన ఘనతను సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో రికార్డ్ సృష్టించాడు భువీ.
టీమిండియాకు దొరికిన పేస్ బౌలింగ్ ఆణిముత్యాల్లో పేసర్ భువనేశ్వర్ కుమార్ ఒకడు. ఇరువైపులా స్వింగ్ చేస్తూ అతడు సంధించే బాల్స్‌ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. స్వింగ్‌తోపాటు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడం భువనేశ్వర్‌కు వెన్నతో పెట్టిన విద్య. కెరీర్ మొదట్లో స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు మంచి పేస్‌తో బౌలింగ్ చేసేవాడు భువీ. అందుకే అతడ్ని ఎదుర్కోవాలంటే బ్యాటర్లు వణికేవారు. అయితే గాయాల వల్ల భువీలో మునుపటి వాడివేడి కాస్త తగ్గింది. గాయాల నుంచి కోలుకుని తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటికీ గతంలోలా రాణించడం లేదు.
అడపాదడపా మంచి ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ స్థాయికి తగ్గట్లుగా ఆడట్లేదు భువనేశ్వర్. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున భువీ బాగా రాణిస్తున్నాడు. తన మీద ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. ఒకప్పటిలా స్వింగింగ్ డెలివరీలతో బ్యాట్స్‌మెన్‌ను తికమక పెడుతున్నాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భువనేశ్వర్ అరుదైన ఘనత సాధించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే ఓపెనర్ సాల్ట్‌ను వెనక్కి పంపాడు. ఈ వికెట్ తీయడంతో ఐపీఎల్ హిస్టరీలో తొలి ఓవర్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు భువీ. ఇప్పటిదాకా తొలి ఓవర్లో అతడు 23 వికెట్లు పడగొట్టాడు. భువీ తర్వాతి స్థానంలో రాజస్థాన్ పేసర్ బౌల్ట్ (21 వికెట్లు) ఉన్నాడు.
Bhuvneshwar Kumar has the most wickets in the first over of an innings in Indian Premier League history.
📸: IPL/BCCI pic.twitter.com/91KQUUonjZ
— CricTracker (@Cricketracker) April 24, 2023