పంజాబ్ జట్టులోని స్టార్ బ్యాటర్ గాయపడ్డాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ వల్ల ఇది జరగడం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. తొలి మ్యాచులో హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన ఆ ప్లేయర్ ఇప్పుడు గాయపడటం పలు సందేహాలని రేకెత్తిస్తోంది.
రాజస్థాన్ తో జరిగిన మ్యాచులో పంజాబ్ గెలిచేసింది. బుధవారం రాత్రి ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెవర్ ప్రభ్ సిమ్రన్ 60 రన్స్ కొట్టి కేక పుట్టించాడు. మరో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 86 పరుగులు చేసి ఒకప్పటి బ్యాటర్ ని అందరికీ చూపించాడు. అయితే శిఖర్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఓ సందర్భంలో కొట్టిన షాట్ వల్ల.. జట్టులోని స్టార్ ప్లేయర్ గాయపడ్డాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు? ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత పంజాబ్ 197 స్కోరు చేయగా, ఛేదనలో రాజస్థాన్ 192 పరుగులకే పరిమితమైపోయింది. మ్యాచ్ ఓడిపోయింది. ఈ పోరులో పంజాబ్ ఓపెనర్లు అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కానీ 11వ ఓవర్ అశ్విన్ వేశాడు. క్రీజులో ఉన్న ధావన్.. బంతిని బలంగా బాదాడు. అయితే నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న భానుక రాజపక్స దాన్ని కాస్త లేటుగా గుర్తించాడు. అంతలోనే బంతి దూసుకురావడం, తన భుజానికి బలంగా తగలడం జరిగిపోయింది. అక్కడికక్కడే నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఒక్క బంతి ఆడి ఒకటే పరుగు చేసిన రాజపక్స.. రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ టైంలోనూ గ్రౌండ్ లోకి రాలేదు.
అయితే పంజాబ్ తొలి మ్యాచ్ కోల్ కతాతో ఆడింది. అందులో 50 పరుగులు చేసిన ఆకట్టుకున్న రాజపక్స.. తర్వాతి మ్యాచుల్లోనూ ఇదే ఊపు కంటిన్యూ చేస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇప్పుడు కెప్టెన్ వల్ల గాయపడి మైదానాన్ని వీడిన తీరు కాస్త కలవరపెడుతోంది. ఎందుకంటే ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కు చెందిన విలియమ్సన్, ఆర్సీబీ బౌలర్ టోప్లే.. ఇలానే మైదానంలోనే గాయపడ్డారు. కేన్ మామ పూర్తి సీజన్ కే దూరం కాగా, టోప్లీ హెల్త్ అప్డేట్ తెలియాల్సి ఉంది. ఇప్పుడు రాజపక్స గాయం ఏ మాత్రం తీవ్రమైనా సరే సీజన్ మొత్తానికి దూరమయ్యే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం పంజాబ్ బ్యాటింగ్ లో పెద్ద దెబ్బ పడటం ఖాయం. మరి ఇలా ఓ బ్యాటర్ వల్ల మరో బ్యాటర్ గాయపడటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
😢 #PBKSvRR #RRvPBKS pic.twitter.com/RXsmZakS56
— India Fantasy (@india_fantasy) April 5, 2023