నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆఖరి బంతికి ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో ఆర్సీబీ భారీ స్కోర్ చేసిందంటే అందుకు కారణం.. కోహ్లీ. అది నుంచే లక్నో బౌలర్లపై ఎదురుదాడికి కోహ్లీ విలువైన అర్ధ సెంచరీ చేశాడు. అయినప్పటికీ.. కోహ్లీ స్లొగా బ్యాటింగ్ చేయడం వలనే ఆర్సీబీ ఈ మ్యాలో ఓడిందని విమర్శిస్తున్నారు. అలాంటి వారందరు ఇది తప్పక చదవాల్సిందే.
టీమిండియాలో ఎన్నో రికార్డులు సృష్టించి అందరి ప్రశంసలు అందుకున్నాడు కోహ్లీ. కానీ ఐపీఎల్ వచ్చేసరికి ఈ స్టార్ బ్యాటర్ ని అందరూ టార్గెట్ చేస్తూ ఉంటారు. బెంగళూరుకి ఇప్పటివరకు ఐపీఎల్ కప్ రాకపోవడమే అందుకు కారణం. గత 15 సీజన్లుగా బెంగళూరు జట్టు తరపున కోహ్లీ ఆడుతున్నా..ఆర్సీబీకి ట్రోఫీ మాత్రం అందించలేకపోయాడు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా ఎన్ని రికార్డులు సృష్టిస్తున్నా.. కప్ ఎందుకు అందించలేకపోతున్నాడని విమర్శకులు ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు.
నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించాడు. కోహ్లీ స్లొగా బ్యాటింగ్ చేయడం వలనే ఇక ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఓడిపోయిందని విమర్శించారు. కానీ ఒక్కసారి ఐపీఎల్ ని పరిశీలిస్తే కోహ్లీ విమర్శించడం సమంజసం కాదనిపిస్తుంది. 15 సీజన్లుగా ఒకే సీజన్ కి ఆడుతున్న కోహ్లీకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. కోహ్లీ ఇన్ని సంవత్సరాలు ఆర్సీబీ జట్టుకి తన వంతు పాత్రని సమర్ధంగా పోషిస్తున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో 5000 కి పైగా పరుగులు, 5 సెంచరీలు,కోహ్లీకి మాత్రమే సాధ్యం. ఏ విధంగా చూసుకున్నా ఒక జట్టు టైటిల్ కొట్టాలంటే సమిష్టి కృషి అవసరం. దాన్ని వదిలేసి కోహ్లీని నిందిస్తే ఏం వస్తుంది.
Only batsman to have fifty against every IPL Team.
Name – #ViratKohli𓃵 #RCBvLSG #IPL2023 pic.twitter.com/jyhnzugmon— Mayur (@133_AT_Hobart) April 10, 2023
కోహ్లీ నిదానంగా ఆడుతున్నడని విషయాన్ని పరిశీలిస్తే.. ఐపీఎల్ ల్లో 130 స్ట్రైక్ రేట్ అనేది చిన్న విషయం కాదు. 150 కి పైగా స్ట్రైక్ రేట్ ఉండడానికి కోహ్లీ ఫినిషర్ కాదు. నెంబర్ 3 వచ్చే బ్యాటర్. ఇన్నింగ్స్ ని నిర్మించే క్రమంలో కాస్త టైం తీసుకుంటాడు. ఆ పరిస్థితుల్లో నిలకడగా పరుగులు చేయడం మీదే బ్యాటర్లు దృష్టి పెడతారు. ఇన్నింగ్స్ మధ్య ఓవర్లలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా ఆడటం కుదరదు. ఇవన్నీ తెలుసుకోకుండా కోహ్లీని విమర్శించడంలో ఏ మాత్రం అర్ధం లేదని తెలుస్తుంది.
Will Virat Kohli become the highest T20 run-scorer till the end of his career? 👀#IPL2023 #Cricket #ViratKohli pic.twitter.com/3VrVF0FJx1
— Sportskeeda (@Sportskeeda) April 11, 2023
Virat kohli is the greatest batsman of all time 🐐#ViratKohli𓃵 pic.twitter.com/IlBjml3YRc
— Priya 💫 (@_ThisisPriya) April 8, 2023