బీసీసీఐ త్వరలోనే ఐపీఎల్ లో కొత్త రూల్స్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ రూల్స్ వస్తే.. విదేశీ ఆటగాళ్లకు భారీ షాక్ తగలనుంది. మరి ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ క్రికెట్లో అత్యంత ఖరీదైన టోర్నీగా ఐపీఎల్ చరిత్రలోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీలో ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు కోట్లకు కోట్లు కుమ్మరిస్తుంటాయి. ఇలాంటి టైమ్ లో ఫ్రాంఛైజీలు చెప్పినట్లుగా ఆటగాళ్లు వినాల్సివస్తుంది. ఇక ఆటగాళ్లు ఐపీఎల్ తో పాటుగా ఇతర క్రికెట్ లీగ్ లు కూడా అడుతుంటారు. ఉదాహరణకు బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ లతో పాటుగా మరికొన్ని లీగ్ ల్లో ఆడుతుంటారు ప్లేయర్స్. అయితే ఇక నుంచి విదేశీ ఆటగాళ్లకు ఈ లీగుల్లో ఆడేందుకు అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే త్వరలోనే బీసీసీఐ కొత్త రూల్స్ ను తీసుకురాబోతుంది. మరి ఆ రూల్స్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ టోర్నీలో కొత్త రూల్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ తో పాటుగా మరికొన్ని లీగ్స్ లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే భారత ఆటగాళ్లను ఇతర లీగుల్లో ఆడకుండా నిబంధనలు పెట్టింది బీసీసీఐ. ఇక ఇప్పుడు విదేశీ ఆటగాళ్లకు కూడా ఆ నిబంధనలు వర్తింపజేయాలని చూస్తోంది. ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో, కోల్ కత్తా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు IPLతో పాటుగా ఇతర లీగుల్లో ఉన్నాయి.
ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా టీ20 లీగ్, కరెబియన్ ప్రీమియర్ లీగ్ లాంటి లీగ్స్ లో జట్లను కలిగి ఉన్నాయి పై జట్లు. ఇప్పుడు ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లు.. ఇతర లీగుల్లో ఆడకుండా త్వరలోనే కొత్త నిబంధనలు తీసుకురానుంది బీసీసీఐ. ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లు తమ జాతీయ, ఇతర లీగుల్లో జట్లకు ఆడాలి అనుకుంటే.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) తీసుకోవాలి. దీనిని పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మరి త్వరలోనే బీసీసీఐ తీసుకురానున్న ఈ రూల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.