ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ మ్యాచులు నేటితో ప్రారంభమయ్యాయి. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ప్లే ఆఫ్ మ్యాచులకి బీసీసీఐ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది.డాట్ బాల్ ప్లేస్ లో ఒక మొక్క సింబల్ ని ఉంచి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది.
గత రెండు నెలలుగా అభిమానులని అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ సీజన్ 16 ముగింపు దశకు చేరుకుంది. ఇందులో భాగంగా నేడు డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్ 1 లో తలపడనుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచులో ధోని సేన హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ప్లే ఆఫ్ మ్యాచులకి బీసీసీఐ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. డాట్ బాల్ ప్లేస్ లో ఒక మొక్క సింబల్ ని ఉంచి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ మ్యాచులు నేటితో ప్రారంభమయ్యాయి. గుజరాత్ టైటాన్స్ తో చెన్నై తలబడుతున్న ఈ మ్యాచులో హార్దిక్ సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్ చేయడానికి ఎప్పటిలాగే గైక్వాడ్, కాన్వే గ్రీజ్ లోకి వచ్చారు. ఎప్పటిలాగానే షమీ మొదటి బౌలింగ్ వేయడానికి సిద్ధమయ్యాడు. మొదటి బంతిని గైక్వాడ్ అవుట్ స్వింగ్ కావడంతో వదిలేసాడు. దీంతో డాట్ బాల్ ప్లేస్ లో అక్కడ మొక్క సింబల్ కనిపించింది. దీంతో ఈ విషయం అక్కడ ఉన్నవారికి అసలేమీ అర్ధం కాలేదు. దీనికి కారణమేమిటని ఆరాదీస్తే.. బీసీసీఐ ప్రతి డాట్ బాల్ కి 500 మొక్కలు నాటబోతుందని తెలుస్తుంది. ఇలాంటి విషయం మనం ఇప్పటివరకు వినకపోయినా.. ఇది నిజం. ఈ మంచి పనికి బీసీసీఐకి ప్రశంసలు దక్కడం గ్యారంటీ. మరి బీసీసీఐ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.