ఉత్సాహంగా సాగుతున్న ipl 2023 టోర్నీలో ఢిల్లీ యాజమాన్యానికి BCCI వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ చేసిన ఓ పనిపై బీసీసీఐ కాస్త కోపంగా ఉన్నట్లు, ఇక ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యాన్ని మందలించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నట్లు నేషనల్ మీడియాలో కథానాలు వస్తున్నాయి.
IPL 2023 టోర్నీ అభిమానులను అలరిస్తూ.. ముందుకు సాగుతోంది. ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన క్రికెట్ ఫ్యాన్స్ కు.. అంతే జోష్ ను అందిస్తోంది. ఇప్పటి వరకు సాగిన మ్యాచ్ లు అన్ని ఫ్యాన్స్ ఉర్రూతలూగించినవే. ఇంత ఉత్సాహంగా సాగుతున్న టోర్నీలో ఢిల్లీ యాజమాన్యానికి BCCI వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ చేసిన ఓ పనిపై బీసీసీఐ కాస్త కోపంగా ఉన్నట్లు, ఇక ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యాన్న మందలించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నట్లు నేషనల్ మీడియాలో కథానాలు వస్తున్నాయి. మరి ఇంతకి ఢిల్లీ క్యాపిటల్స్ ఏం పని చేసింది? బీసీసీఐ ఎందుకంత గుర్రుగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2023 లో భాగంగా తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ తో తలపడింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ లో లక్నో విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ యాజమాన్యం స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ జెర్సీని తమ డగౌట్ లో వేలడదీసింది. ప్రస్తుతం ఇదే సమస్యకు దారితీసింది. గతేడాది ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు పంత్. దాంతో ఈ సంవత్సరం జరిగే అన్ని మెగా టోర్నీలకు పంత్ దూరం అయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023 సీజన్ మెుత్తానికి దూరం అయ్యాడు. అయింతే పంత్ పై తమకు ఉన్న ప్రేమను ఢిల్లీ యాజమాన్యం.. డగౌట్ లో 17వ నెంబర్ తో ఉన్న పంత్ జెర్సీని ప్రదర్శించింది.
ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఇలా జెర్సీని ప్రదర్శించడాన్ని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఓ ఆటగాడు లేడన్నసందర్భంలో.. లేదా రిటైర్డ్ అయిన సందర్భంలోనే ఇలా ప్రదర్శిస్తారని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయంపై బీసీసీఐ ఢిల్లీ యాజమాన్యాన్ని మందలించినట్లు తెలుస్తోంది. ఇలాంటివి మరోసారి రిపీట్ కానివొద్దని హెచ్చరించినట్లు కూడా సమాచారం. కాగా మంగళవారం(ఏప్రిల్ 4) ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. సొంత మైదానంలో మ్యాచ్ ఆడుతుండటం వల్ల ఈ మ్యాచ్ ను పంత్ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.