కోహ్లీ-గంభీర్ వివాదం క్రికెట్ వర్గాలను కుదిపేసింది. దీంతో ఈ వివాదంపై బీసీసీఐ కూడా సీరియస్ అయ్యింది. ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ సమయంలో కొందరు లక్నో ప్లేయర్లు గంభీర్‌కు షాక్ ఇస్తున్నారు. అసలేం జరిగిందంటే..!
గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతూ ఫైనల్ ఓవర్ వరకు వెళ్తున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. మ్యాచ్‌లే కాదు ఆటగాళ్ల మధ్య కొట్లాటలు కూడా ఐపీఎల్‌ను టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చేశాయి. టీమిండియా లెజెండరీ ప్లేయర్లు సౌరవ్ గంగూలీ, గౌతం గంభీర్లతో విరాట్ కోహ్లీ గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కోహ్లీ-గంభీర్ వివాదంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఇలా చిన్న పిల్లల్లా గొడవ పడటం ఏంటని క్రికెట్ మాజీలు, విశ్లేషకులు అంటున్నారు. గేమ్‌కు బ్రాండ్ అంబాసిడర్ల లాంటి ప్లేయర్లే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల యువ క్రికెటర్లలో చెడు సందేశం వెళ్తుందని చెబుతున్నారు.
కోహ్లీతో లక్నో మెంటార్ గంభీర్‌కే కాదు ఆ జట్టు ప్లేయర్ నవీన్ ఉల్ హక్కు కూడా గొడవైంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో భవిష్యత్తులో ఆడే మ్యాచ్‌ల్లో లక్నో ఆటగాళ్లు ఎలా ప్రవర్తిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇవాళ ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కోహ్లీకి లక్నో జట్టులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆ జట్టు కీలక బ్యాటర్ ఆయుష్ బదోని విరాట్‌కు వీరాభిమాని. కోహ్లీని ఇన్స్పిరేషన్గా తీసుకునే బదోని.. వీలు దొరికినప్పుడల్లా విరాట్‌పై తనకు ఉన్న అభిమానాన్ని చూపిస్తుంటాడు. గంభీర్, నవీన్‌తో గొడవ అయినప్పటికీ బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీపై ప్రేమను చూపించాడు ఆయుష్ బదోని. ఈ మ్యాచ్‌లో 33 బాల్స్‌లో 59 రన్స్ చేశాడు బదోని.
హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే కోహ్లీ స్టైల్లో అభిమానులకు కిస్ ఇచ్చి సెలబ్రేషన్ చేసుకున్నాడు బదోని. సొంత జట్టు ప్లేయర్ కోహ్లీపై ప్రేమను ఇలా చూపించడంతో డగౌట్లో కూర్చున్న లక్నో మెంటార్ గంభీర్ షాకయ్యాడు. బదోని సెలబ్రేషన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు 19.2 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. వర్షంతో ఆట నిలిచిపోయింది. లక్నో ఇన్నింగ్స్‌లో బదోని, నికోలస్ పూరన్ (20) తప్పితే ఆ టీమ్‌లో అందరు బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు మొయిన్ అలీ, మహీష తీక్షణ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. కీలక బ్యాటర్ స్టొయినిస్‌ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. పేసర్ మతీష పతిరానా కూడా రెండు వికెట్లతో మరోసారి సత్తా చాటాడు.
A cracking fifty from Ayush Badoni 🙌
He gets to his half-century in style with a maximum 🔥🔥
Follow the match ▶️ https://t.co/QwaagO40CB #TATAIPL | #LSGvCSK pic.twitter.com/lxk9zSMa5I
— IndianPremierLeague (@IPL) May 3, 2023
Ayush Badoni after owning CSK did Kohli celebration in 2022
And now flying kiss in 2023 🤣🤣 pic.twitter.com/7VNnWUkrfy
— Gaurav (@Melbourne__82) May 3, 2023