అథర్వ తైదే ఈ పేరు చాలా మందికి పరిచయం లేకపోవచ్చు. క్రికెట్ నాలెడ్జ్ బాగా ఉండి.. క్రికెట్ ని ఫాలో అయితే తప్ప ఈ పేరు దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ బ్యాటర్ ప్రస్తుతం ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ఇంతకీ ఎవరీ సంచలనం?
ఐపీఎల్ అంటేనే సుదీర్ఘమైన లీగ్. ఈ లీగ్ లో ఒక మ్యాచులో కాకపోయినా మరొక మ్యాచులో సత్తా చాటడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది యంగ్ ప్లేయర్లు తమ టాలెంట్ ని నిరూపించుకొని అందరి దృష్టిలో పడిన సంగతి తెలిసిందే. ఒక రకంగా అప్ కమింగ్ ప్లేయర్స్ కి ఐపీఎల్ అనేది ఒక వరం లాంటిది. ఈ లీగ్ కి ఉండే పాపులారిటీ ఎలాంటిదో మనకు తెలిసిందే. కేవలం ఒక్క ఇన్నింగ్స్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్ ద్వారా కొంతమంది ప్లేయర్లు
ఇప్పటికే తమ టాలెంట్ నిరూపించుకొని ఏకంగా టీమ్ ఇండియా లోకే అడుగుపెట్టారు. ఈ మధ్యనే రింకూ సింగ్ వరుసగా 5 సిక్సులు కొట్టి సంచలనంగా మారితే ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్ అథర్వ తైదే మంచి ప్రదర్శన చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.
అథర్వ తైదే ఈ పేరు చాలా మందికి తెలియదు. క్రికెట్ నాలెడ్జ్ బాగా ఉండి.. క్రికెట్ ని ఫాలో అయితే తప్ప ఈ పేరు దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ బ్యాటర్ ప్రస్తుతం ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ఇక ఈ క్రికెటర్ గురించి చెప్పుకోవాలంటే మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి చెందినవాడు. 2018-19 సీజన్లో లిస్ట్ ఏ క్రికెట్లోకి అడుగుపెట్టి ఆ తర్వాతా రంజీల్లో విదర్భ తరపున ఆడి రాణించాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ 20 లోకి అడుగుపెట్టాడు. ఇటీవలే ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఈ ఆటగాడిని కేవలం 20 లక్షలకి దక్కించుకుంది. ఇక ఇప్పటివరకు 15 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 887 పరుగులు, 24 లిస్ట్ ఏ క్రికెట్లో 758 పరుగులు చేసాడు. 33 టీ 20ల్లో 774 పరుగులులతో పాటు 10 వికెట్లు కూడా తీసాడు.
ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో ఈ ప్లేయర్ అదరగొట్టేస్తున్నాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా తుది జట్టులో స్థానం సంపాదించుకున్న తైదే.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల ఒడిసి పట్టుకున్నాడు. ముఖ్యంగా నిన్న లక్నోతో జరిగిన మ్యాచులో పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఎదరుగా కొండంత లక్ష్యం ఉన్నా.. బౌండరీలతో చెలరేగాడు. ఓ వైపు స్టార్ ప్లేయర్లు విఫలమవుతున్నా తైదే మాత్రం పరుగుల వరద పారించాడు. 36 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 66 పరుగులు చేసాడు. ఎంతో అనుభవం ఉన్న బ్యాటర్ లాగా ఆడుతూ అందరినీ ఆశ్చర్యంలో పడేస్తున్నాడు. కేవలం 20 లక్షలకే అమ్ముడుబోయిన అంతకు మించి రాణిస్తున్నాడు. అయితే తైదే పోరాడినప్పటికీ ఈ మ్యాచులో పంజాబ్ 56 పరుగులతో ఓడిపోయింది. ఇలాగే ఈ బ్యాటర్ ఫామ్ ని కొనసాగిస్తే స్టార్ ప్లేయర్ గా మారే ఛాన్స్ ఉంటుంది. మరి తైదే ఇన్నింగ్స్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Fifty for Atharva Taide#CRICKET #IPL23 #PBKSvsLSG pic.twitter.com/yeRdCnCslq
— Cricket Addictor (@AddictorCricket) April 28, 2023