Arjun Tendulkar: సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. రెండో మ్యాచ్ ఆడిన అర్జున్ డెత్ ఓవర్స్‌లో మంచి బౌలింగ్ వేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అర్జున్ గ్రౌండ్‌లో బుతూలు తిట్టాడు.
ఐపీఎల్ 2023లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ అదరగొడుతున్నారు. 2021 నుంచి ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్న అర్జున్‌కు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌తో అర్జున్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసిన అర్జున్ 5 పరుగులు మాత్రమే ఇచ్చి.. తన ఎంట్రీని ఘనంగా చాటాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 2 ఓవర్లు బౌలింగ్ వేసిన అర్జున్.. 17 పరుగులు ఇచ్చాడు.
తాజాగా ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్ వేసిన అర్జున్ ఒక వికెట్ తీసుకోవడంతో పాటు కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై బౌలర్లలో అందరి కంటే తక్కువ ఎకానమీతో అర్జున్ బౌలింగ్ చేయడం విశేషం. పైగా చివరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 20 పరుగులు అవసరమైన సమయంలో బంతి అందుకున్న అర్జున్.. ఒత్తిడిలో మంచి ప్రదర్శన కనబర్చి.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో భారత్‌కు మరో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ దొరికేసినట్లే అంటూ క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అర్జున్ ప్రదర్శన గురించి అటుంచితే.. ఈ మ్యాచ్ ఆరంభంలో అర్జున్ బూతులు తిడుతూ కనిపించాడు. అర్జున్.. సచిన్ టెండూల్కర్ కుమారుడు కావడంతో అతని ప్రతి కదలికపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. ఇదే విషయాన్ని గమనించిన కెమెరామెన్ అర్జున్ టెండూల్కర్‌ను పదే పదే పెద్ద స్క్రీన్‌పై చూపించడంతో అసహనానికి గురైన అర్జున్.. కెమెరామెన్‌ను బూతులు తిట్టినట్లు కనిపిస్తోంది. అర్జున్ వాయిస్ వినిపించనప్పటికీ.. అతని లిప్ మూమెంట్‌ను బట్టి.. హిందీలో బూతులు తిట్టాడంటూ.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇటివల సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సైతం తనను పదే పదే బిగ్ స్క్రీన్‌పై చూపించడంతో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరి అర్జున్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Did Arjun Tendulkar say, “Mujhe jaan much kar dikhate BC” when the camera pointed at him? 😂
— Sameer Allana (@HitmanCricket) April 18, 2023
— Tirth Thakkar (@ImTT01) April 18, 2023