Arjun Tendulkar: సచిన్ కొడుక కదా అర్జున్ టెండూల్కర్‌పై భారీ అంచనాలు ఉండటం సహజం. అయితే అర్జున్ బౌలర్ కావడంతో కాస్త క్యాపరిజన్ తలనొప్పి ఉండకపోవచ్చు.. కానీ, చిన్న చిన్న విషయాల్లో కూడా అర్జున్ కాస్త జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇలా దొరికిపోతాడు.
ఇండియన్ క్రికెట్ గాడ్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. 2021 నుంచి ముంబై ఇండియన్స్‌లో సభ్యుడిగా ఉన్న అర్జున్ టెండూల్కర్‌కు ఈ సీజన్‌లో ఆడే అవకాశం దక్కింది. ముంబై జట్టులో కీలక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ లేకపోవడంతో.. ప్రస్తుతం అర్జున్‌కు వరుస అవకాశాల వస్తున్నాయి. వాటి అర్జున్ కూడా అద్భుతంగా వినియోగించుకుంటున్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేస్తూ.. ఆకట్టుకుంటున్నాడు. మంగళవారం మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయినా.. అర్జున్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఒక వికెట్ కూడా పడగొట్టాడు.
అయితే.. బౌలింగ్ పరంగా అర్జున్ టెండూల్కర్‌పై ప్రశంసలు కురుస్తున్నా.. అర్జున్ చేసిన ఒక అల్లరి పని మాత్రం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. మ్యాచ్ మధ్యలో ముక్కులో పొక్కు తీసుకున్న అర్జున్ ఆ వేలిని మళ్లీ వెంటనే నోట్లో పెట్టుకున్నాడు. ముక్కులు వేలు పెట్టుకుని మళ్లీ అలా ఎలా నోట్లో పెట్టుకున్నాడంటూ ఆ వీడియో చూసిన వారు షాక్ అవుతున్నారు. చిన్నపిల్లాడి చేష్టలు ఇంకా పోలేదంటూ పేర్కొంటున్నారు. అర్జున్ అలా ముక్కులో వేలు పెట్టుకుని మళ్లీ అదే వేలిని నోట్లో పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి అర్జున్ టెండూల్కర్ చేసిన ఈ అల్లరి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— dc (@kaunHuMei) April 26, 2023