Arjun Tendulkar IPL Debut: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ టీమ్‌లో చాలా కాలంగా ఉన్న అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో ఆడే అవకాశం ఇప్పుడు దక్కింది.
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. దాదాపు 2021 నుంచి ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉన్న అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. కానీ.. ఈ సీజన్‌లో మాత్రం తన తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఆదివారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. చాలా కాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న అర్జున్ టెండూల్కర్‌కు ఎట్టకేలకు ఛాన్స్ రావడంపై సచిన్ అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంటున్న ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్జున్ టెండూల్కర్‌కు క్యాప్ అందించాడు. మరో విశేషం ఏంటంటే.. మ్యాచ్ తొలి ఓవర్‌ను అర్జున్‌తోనే వేయించాడు.తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. తొలి ఓవర్‌ను అద్భుతంగా వేసిన అర్జున్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కేకేఆర్ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్.. అర్జున్‌ను ఎదుర్కొనేందుకు కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇక అర్జున్ రన్నప్, యాక్షన్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. అతన్ని ఉత్సాహపరిచేందుకు సచిన్ కుమార్తె, అర్జున్ సొదరి సారా టెండూల్కర్ సైతం మ్యాచ్ చూసేందుకు వచ్చింది. మరి అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
IPL debut ✅
Opening the bowling ✅
Say hello to Arjun Tendulkar 👋
Go well 👍 👍
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi #TATAIPL | #MIvKKR | @mipaltan pic.twitter.com/J8vFYhLCIv
— IndianPremierLeague (@IPL) April 16, 2023
• Rohit Sharma Playing As Impact Player.
• SuryaKumar Yadav Is The Captain.
• Arjun Tendulkar Playing His 1st IPL Match.
• Indian And MI Captain Harmanpreet Kaur Was Present During Toss.
• Sara Tendulkar Is Here .#MIvsKKR pic.twitter.com/h1OPs9XFCP— Sir BoiesX 🕯 (@BoiesX45) April 16, 2023
What a first over by Arjun Tendulkar on his debut in the IPL.
Right on 🎯#MIvKKR pic.twitter.com/OmBd2NhvY2
— Rahul Sharma (@CricFnatic) April 16, 2023
Sachin gave Rohit Sharma his debut cap 🧢 and Rohit sharma gave Arjun tendulkar his debut cap pic.twitter.com/tKskJMBZKD
— Ansh Shah (@asmemesss) April 16, 2023