Arjun Tendulkar: 2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా.. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో మాత్రం స్థానం దక్కడం లేదు. కానీ.. ఐపీఎల్ 2023లో శనివారం చెన్నైతో మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2023లో మరో మెగా సమరానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్‌లో చరిత్రలోనే అత్యంత విజయవంతమై రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌లో అత్యధికంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్, అలాగే నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైఓల్టేజ్ మ్యాచ్. రోహిత్ శర్మ వర్సెస్ మహేంద్ర సింగ్ ధోని.. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఇప్పటికే ఆర్సీబీతో బిగ్ మ్యాచ్ ఆడిన ముంబై ఇప్పుడు ఇప్పుడు చెన్నైని ఢికొట్టబోతుంది. చెన్నైకి ఇదో మూడో మ్యాచ్. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడినా.. లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించి.. ఇప్పుడు రెండో గెలుపు కోసం బరిలోకి దిగుతుంది. ఇక ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో చెన్నైపై ఎలాగైనా గెలిచి.. తొలి విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.
అందుకోసమే ఈ సారి భారీ మార్పులతో ముంబై బరిలోకి దిగనుంది. ఇప్పటికే బుమ్రా లేక ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. ముంబై పేస్ కింగ్ జోఫ్రా ఆర్చర్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఆర్చర్ స్థానంలో మెరిడిత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే స్పిన్నర్ హృతిక్ షోకిన్ స్థానంలో కుమార్ కార్తీకేయ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండే అవకాశం ఉంది. వీరితో పాటు టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్ అర్జున్ టెండూల్కర్ చెన్నైతో మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైతో మ్యాచ్ కోసం అర్జున్ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను ముంబై ఇండియన్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అతని ఎంట్రీపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
ఐపీఎల్ 2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న అర్జున్ టెండూల్కర్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే ఇటివల కాలంలో అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబర్చాడు. ముంబైకి చెందిన అర్జున్.. ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో తెగదెంపులు చేసుకుని.. గోవా జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. రంజీల్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే.. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్.. చెన్నైతో మ్యాచ్‌లో బరిలోకి దిగితే.. ధోనికి బౌలింగ్ చేస్తే.. చూసేందుకు బాగుటుందని క్రికెట్ అభిమానులు ఆశపడుతున్నారు. ధోని వర్సెస్ అర్జున్ టెండూల్కర్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Arjun Tendulkar in the practice session. pic.twitter.com/DRoEUJStrj
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2023