Arjun Tendulkar: సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడు. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ చరిత్రలోనే ఇంత వరకు లేని ఒక రికార్డును సైతం సృష్టించాడు.
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై.. ఇప్పుడు విజయాల బాట పట్టింది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏమిటంటే.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన అర్జున్ తొలి ఓవర్ వేసి.. మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
దాదాపు 2021 నుంచి ముంబై ఇండియన్స్‌లో ఉన్న అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. చాలా కాలం తర్వాత.. ఎట్టకేలకు ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో అర్జున్‌కు బరిలోకి దిగే ఛాన్స్ వచ్చింది. ఆదివారం జరిగి డబుల్ హెడ్డర్‌లో తొలి మ్యాచ్‌లో ముంబైతో కోల్‌కత్తా జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్టులో చోటు దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్‌తో.. తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి ఓవర్ వేయించాడు. ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ రహమనుల్లా గుర్బాజ్ స్ట్రైక్‌లో ఉండగా.. బౌలింగ్ వేసిన అర్జున్.. తొలి ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని బౌలింగ్ యాక్షన్, రన్నప్ బాగుందంటూ క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసించారు. అయితే.. తొలి, మూడో ఓవర్ మాత్రమే వేసిన అర్జున్‌తో సూర్య 4 ఓవర్ల కోట పూర్తి చేయించలేదు. డెత్ ఓవర్స్‌లో బౌలింగ్ వేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
అయితే.. ఈ మ్యాచ్‌లో మొత్తం 2 ఓవర్లు బౌలింగ్ వేసిన అర్జున్ టెండూల్కర్ 17 పరుగులు ఇచ్చాడు. వికెట్ దక్కకపోయినా.. అర్జున్ ఫస్ట్ మ్యాచ్‌పై అంతా సంతృప్తిగా ఉన్నారు. అయితే.. ఈ మ్యాచ్‌తో అర్జున్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో తండ్రి ఆడిన జట్టుకు ఆడిన తొలి క్రికెటర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. అసలు జట్టే కాదు.. తండ్రి, కొడుకు ఐపీఎల్ ఆడటం ఇదే తొలి సారి. ఐపీఎల్ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఇది జరగలేదు. సచిన్ టెండూల్కర్ సైతం ముంబై ఇండియన్స్ ఆడిన విషయం తెలిసిందే. అతనే ముంబైకి తొలి కెప్టెన్. ఇప్పుడు అర్జున్ సైతం అదే టీమ్‌కు ఆడటంతో.. ఐపీఎల్‌లో ఆడిన తొలి తండ్రి, కొడుకులుగా రికార్డు సృష్టించారు. మరి అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీతో పాటు, అతని బౌలింగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The long-awaited occasion is finally here 🧢 congratulations #ArjunTendulkar 🙌🏻 proud moment for the master @sachin_rt 🤗❤️ @mipaltan pic.twitter.com/PoHgFa8KGB
— Yuvraj Singh (@YUVSTRONG12) April 16, 2023