సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్.. మూడో మ్యాచ్ కే తేలిపోయాడు. పంజాబ్ పై ఓ వికెట్ తీసినప్పటికీ.. భారీగా పరుగులిచ్చేసి, ఓ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు.
దిగ్గజ సచిన్ ఎంత గొప్ప క్రికెటర్. అంతమాత్రాన కొడుకు అర్జున్ కూడా గొప్ప క్రికెటర్ కావాలని రూలేం లేదుగా? గత కొన్నాళ్లుగా ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టులో ఉన్నప్పటికీ.. అర్జున్ కి ఆడే ఛాన్స్ దక్కలేదు. ఈ సీజన్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి అవకాశాలు ఇస్తున్నాడు. అర్జున్ మాత్రం వాటిని ఎందుకో సరిగా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. గత మ్యాచ్ లో ఒక్క వికెట్ తీసినందుకే నానా హంగామా చేశారు. ఇప్పుడు అదే అర్జున్.. ఐపీఎల్ లో ముంబయి తరఫున ఘోరమైన రికార్డు నమోదు చేశాడు. దీంతో అర్జున్ ఆటతీరు హాట్ టాపిక్ గా మారిపోయింది. కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు సమర్ధిస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సచిన్ కేవలం బ్యాటర్ మాత్రమే. అప్పుడప్పుడు స్పిన్ బౌలింగ్ చేసేవాడు కానీ పూర్తిస్థాయి బౌలర్ అయితే కాదు. అతడి కొడుకు అర్జున్ మాత్రం ఆల్ రౌండర్ గా ఎదిగాడు. ప్రస్తుత ఐపీఎల్ లో బౌలర్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అనుభవం లేకపోవడం వల్లనో ఏమో గానీ పరిస్థితులు అతడికి అస్సలు సహకరించట్లేదు. కేకేఆర్ తో మ్యాచ్ లో 2 ఓవర్లు వేసిన అర్జున్ 17 పరుగులిచ్చి వికెట్లేం తీయలేకపోయాడు. దీంతో రోహిత్ అతడికి బౌలింగ్ ఇవ్వలేదు. సన్ రైజర్స్ పై అర్జున్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో కాస్త పర్వాలేదనిపించాడు.
తాజా మ్యాచ్ లో అర్జున్ బౌలింగ్ ని పంజాబ్ బ్యాటర్లు చితక్కొట్టేశారనే చెప్పాలి. ఎందుకంటే ఒకే ఓవర్ లో ఏకంగా 31 పరుగుల రాబట్టుకున్నారు. దీంతో అర్జున్ ఐపీఎల్ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేశాడు. ప్రస్తుత సీజన్ లో ఒకే ఓవర్ లో ఎక్కువ పరుగులిచ్చిన బౌలర్ గా ఉన్నాడు. ముంబయి తరఫున ఒకే ఓవర్ లో ఎక్కువ రన్స్ ఇచ్చేసిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇలా మూడో మ్యాచ్ కే అర్జున్ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు. అయితే అర్జున్ అనుభవం లేకపోవడం ఓ సమస్య అయితే.. సచిన్ కొడుకు అనే ఒత్తిడి వల్ల ఇలా జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ముందు ముందు మ్యాచ్ ల్లో అర్జున్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే అర్జున్ చెత్త రికార్డు నమోదు చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
An over to forget for Arjun Tendulkar #MIvPBKS | #IPL2023 pic.twitter.com/taCczEJfs4
— ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2023