సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో సినీ తారలు కనిపించి సందడి చేస్తారు. అప్పుడప్పుడు రాజకీయవేత్తలు కనిపిస్తూ ఉంటారు. కానీ నిన్న ఢిల్లీ, కేకేఆర్ మ్యాచ్ చూడడానికి ఆపిల్ CEO టామ్ కుక్ వచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసాడు. అతనితో పలు సెలెబ్రిటీలు కూడా ఐపీఎల్ మ్యాచ్ వచ్చారు. .
ఐపీఎల్ 2023 లో అభిమానులకి ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఎప్పుడూ వీకెండ్ లో రెండు మ్యాచులు చూసే ప్రేక్షకులకి నిన్న (గురువారం)కూడా డబుల్ ధమాకాతో అభిమానులని అలరించాయి. మధ్యాహ్నం పంజాబ్ తో జరిగిన మ్యాచులో బెంగళూరు విజయం సాధిస్తే.. రాత్రి కేకేఆర్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఢిల్లీ గెలిచి ఈ సీజన్ లో బోణి కొట్టింది. దీంతో ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరంగా మారనుంది. ఆర్సీబీ, పంజాబ్ మ్యాచులో కోహ్లీ కెప్టెన్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. ఢిల్లీ, కేకేఆర్ మ్యాచులో కొంతమంది సెలెబ్రిటీలు మ్యాచ్ వీక్షించి హైలెట్ గా మారారు. ఈ మ్యాచ్ చూడడానికి ఏకంగా ఆపిల్ CEO రావడం విశేషం. అతనితో ఎవరెవరు వచ్చారంటే ?
ఐపీఎల్ 2023 ప్లేయర్లతోనే కాదు తారలతో కూడా సందడి చేస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ ఐపీఎల్ లో సెలెబ్రిటీలు, బిజినెస్ ప్రముఖులు, రాజకీయవేత్తలు స్టేడియం లో కనిపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నారు. తాజాగాఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కొంతమంది సెలెబ్రిటీలు కనిపించి సందడి చేశారు. నిన్న రాత్రి ఢిల్లీ , కేకేఆర్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆపిల్ CEO టామ్ కుక్ మ్యాచ్ చూడడానికి వచ్చారు. అతనితో పాటు మాజీ ఐపీఎల్ చైర్ మెన్, ప్రస్తుత రాజ్యసభ మెంబర్ రాజీవ్ శుక్ల కూడా మ్యాచ్ చూస్తూ కనిపించాడు. బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్, అలాగే ఆనంద్ అహుజా మ్యాచ్ ఎంజాయ్ చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌటైంది. టాప్ ఆర్డర్ లో రాయ్ (43) రాణించగా..మిగిలినా వారందరు విఫలమయ్యారు. ఒక దశలో 100 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. కానీ చివర్లో రస్సెల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడడంతో ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. ఢిల్లీ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో కూడా ఢిల్లీ జట్టు తడబడింది. దీంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లగా.. ఢిల్లీ విజయం సాధించింది. వార్నర్(57) కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించగా… మిగిలిన వారి నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనైతే రాలేదు. దీంతో ఈ సీజన్లో ఢిల్లీ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ సంగతి అలా ఉంచితే ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్ గా పేరు గాంచిన టామ్ కుక్ వీలు చూసుకొని ఐపీఎల్ మ్యాచ్ కి రావడం నిన్న మ్యాచ్ కె హైలెట్ గా మారింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి