కోహ్లీ ఎక్కడ ఉంటే భార్య అనుష్క శర్మ అక్కడ మెరుస్తుంది. కానీ ఓ వైపు బెంగళూరు మ్యాచ్ జరుగుతుంటే ధోని ఫ్యాన్ అని చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది. మరి అనుష్క శర్మ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ?
ఐపీఎల్ లో కొన్ని జట్లకు ఉండే క్రేజ్ వేరు. వీటిలో ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ముందు వరుసలో ఉంటాయి. ధోని, కోహ్లీ, రోహిత్ కి ఉన్న ఫాలోయింగ్ కారణంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. వీటిలో ఏ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినా.. అభిమానులకి పండగే. ఇందులో భాగంగా నిన్న బెంగళూరు, చెన్నై జట్ల మధ్య చిన్న స్వామి వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియం కిక్కిరిసిపోయింది. ఓ వైపు ధోని మరో వైపు కోహ్లీ ఇద్దరి అభిమానుల కోలాహలం నిన్న మ్యాచ్ కే హైలెట్ గా మారింది. ఇదిలా ఉండగా..కోహ్లీ భార్య అనుష్క శర్మ నేను ధోని ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్లో ధోని, కోహ్లీ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారీ స్థాయిలో అభిమానులు వీరి సొంతం. వీరి అభిమానులు అయితే మావాడు గ్రేట్ అంటే మా వాడు తోపు అని చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు అనుష్క శర్మ నేను కూడా ధోని ఫ్యాన్ అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. చిన్న స్వామి స్టేడియంలో కోహ్లీకి ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో మనకు తెలిసిందే. కానీ ధోని కోసం కూడా అభిమానులు భారీగా తరలి వచ్చారు. చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ కి వస్తుండగా అభిమానులు ధోని పేరుని జపించడం విశేషం. ఈ సందర్భంగా అనుష్క శర్మ తాను కూడా ధోని ఫ్యాన్ అని చెప్పడం గమనార్హం. నేనే కాదు కోహ్లీ కూడా ధోని ఫ్యాన్ అని చెప్పిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. దీంతో ధోనిని కోహ్లీ, అనుష్క శర్మ లు ఎంత గౌరవిస్తారో అర్ధం అవుతుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ కాన్వే(83) అర్ధ సెంచరీతో చెలరేగగా.. దూబే(52) సిక్సర్ లతో శివాలెత్తించాడు. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్సీబీకి కోహ్లీ తొలి ఓవర్లోనే ఔటైనా .. మ్యాక్స్ వెల్(76), కెప్టెన్ డుప్లెసిస్(62) స్కోర్ బోర్డు ని పరుగులెత్తించారు. ఒక దశలో వీరిద్దరే మ్యాచ్ ని ఫినిష్ చేస్తారేమో అన్నట్లుగా బెంగళూరు ఇనింగ్స్ సాగింది. 100 పరుగుల భారీ భాగస్వామ్యం తరువాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో ఆర్సీబీ పరాజయ పాలైంది. చివర్లో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించినా లాభం లేకుండా పోయింది. మరి విరాట్ కోహ్లీ ఉన్నా.. అనుష్క శర్మ ధోని ఫ్యాన్ అని చెప్పి గొప్ప మనసు చాటుకుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.