రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్... తనని తొక్కేయాలని చూశారంటూ!

రిటైర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అప్పట్లో తనని తొక్కేయాలని చూశారని అన్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 08:07 AM IST

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. అన్నిరకాల క్రికెట్ నుంచి గ్రాండ్ గా రిటైర్ అయ్యాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ ఇతడికి చివరి మ్యాచ్. ఈ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. దీంతో కెప్టెన్ ధోనీ ట్రోఫీ తీసుకోకుండా.. రాయుడుతోపాటు జడేజాని ఆహ్వానించాడు. వీళ్లే ట్రోఫీని అందుకునేలా చేశాడు. రాయుడు రిటైర్మెంట్ బాగానే జరిగినప్పటికీ కెరీర్ లో మాత్రం చాలా ఎత్తుపల్లాలు చూశాడు. తాజాగా ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అవి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. అలానే తనని కొందరు తొక్కేయాలని చూశారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ రాయుడు ఏం చెప్పాడు?

ఇక వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకి చెందిన రాయుడు క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండర్-19 కెప్టెన్ గా టీమిండియాని గెలిపించాడు. ఆ తర్వాత దేశవాళీల్లో ఆడాడు గానీ జాతీయ జట్టులో అయితే చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో 2013 నుంచి కొన్నేళ్లపాటు ముంబయి ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడాడు. ఐపీఎల్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో టీమిండియా సీనియర్ జట్టులోనూ చోటు సంపాదించాడు. దాదాపు ఆరేళ్లలో 61 మ్యాచులు ఆడాడు. ఈ సందర్భంగా చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో తనని చాలామంది తొక్కేయాలని చూశారని అన్నాడు.

‘క్రికెట్ పై ఇష్టం కారణంగా ఏడెనిమిదేళ్ల వయసులోనే బ్యాటు పట్టాను. అప్పటినుంచి మొన్నటివరకు ఆటే నా జీవితంగా సాగింది. ఎలాంటి క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఎంతో మంది నన్ను తొక్కేయాలని చూశారు. క్రికెట్ పై ఏకాగ్రత పెట్టనీయకుండా, మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యేలా చేశారు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ ఎప్పుడు ఎవరికీ బెండ్ కాలేదు. గ్రౌండ్ లో లేదా బయట ఎక్కడా కూడా రాజీపడలేదు. టాలెంట్ ని నమ్ముకుని ధైర్యంగా సవాళ్లు ఫేస్ చేశాను. టీమిండియాకు ఆడాను. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ లాంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాను. గర్వంగా రిటైర్మెంట్ ప్రకటించాను’ అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed