ఐపీఎల్ లో గోల్డెన్ లెగ్ ఎవరిది అని అడిగితే కొంతమంది ధోని అని చెబితే.. మరికొందరు రోహిత్ శర్మ అని చెప్పుకొస్తారు. ఎందుకంటే కెప్టెన్లుగా వీరు తమ జట్లను చాలా సార్లు ఛాంపియన్లుగా నిలిపారు. అయితే ఈ విషయంలో అందరికంటే రాయుడు అదృష్టవంతుడనే చెప్పుకోవాలి.
“ఐపీఎల్ లో అంబటి రాయుడు ఉన్న టీంకి ఫెయిర్ ప్లే అవార్డు రాదు”. మ్యాచ్ అనంతరం రాయుడిని ఉద్దేశిస్తూ చెన్నై కెప్టెన్ ధోని సరదా వ్యాఖ్యలు చేసాడు. అయితే ఇందులో నిజమున్నా.. ఒక విషయంలో మాత్రం ధోని కంటే రాయుడికి ఉన్న అదృష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ధోని ఎక్కడుంటే అదృష్టం కూడా అక్కడే ఉంటుంది అనే టాక్ ఉంది. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందరూ కూడా ధోనీనే గోల్డెన్ లెగ్ గా భావిస్తారు. అయితే లక్కీ ప్లేయర్ అంటే రాయుడు తర్వాతే ఎవరైనా అని చెప్పాల్సిందే. దానికి కారణం కూడా లేకపోలేదు. మరి రాయుడు ధోనిని మించిన లక్ ఏ విషయంలో ఉందో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకున్నాడు రోహిత్ శర్మ. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ప్లేయర్ గా ట్రోఫీ గెలుచుకున్న హిట్ మ్యాన్.. కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించాడు. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ముంబైని ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపాడు. అయితే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో 6 ఐపీఎల్ ట్రోఫీలతో రాయడు రోహిత్ సరసన చేరాడు. 2013, 2015, 2017ల్లో ముంబై తరఫున రాయుడు టైటిల్ గెలిచిన రాయుడు.. 2018, 21 లో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి ఐపీఎల్ ట్రోఫీలు సంపాదించాడు. ఇక తాజాగా.. నిన్న చెన్నై గెలవడంతో రాయుడు ఐపీఎల్ టైటిల్స్ 6 కి చేరింది. ఈ విషయంలో ధోని కూడా 5 టైటిల్స్ తో తర్వాత స్థానంలో నిలవడం గమనార్హం.
ప్రతిభావంతుడైన క్రికెటర్ అయిన అంబటి రాయుడు ఐపీఎల్‌లో గోల్డెన్ లెగ్ అని చెప్పొచ్చు. ధోనీ పదకొండుసార్లు ఫైనల్ చేరితే.. ఐదుసార్లు టైటిల్ గెలుపొందాడు. సురేశ్ రైనా, రవీంద్ర జడేజా ఎనిమిదిసార్లు ఫైనల్ చేరితే.. నాలుగుసార్లు టైటిళ్లు సాధించారు. కానీ అంబటి రాయుడు ఎనిమిదిసార్లు ఐపీఎల్ ఫైనల్ చేరగా.. ఆరుసార్లు టైటిల్ గెలుపొందాడు. కేవలం రెండుసార్లు మాత్రమే అతడి జట్టు ఫైనల్లో ఓడిపోయింది. ధోనీ అత్యధికంగా 28సార్లు ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కి చేరుకోగా.. రాయుడు 23 సార్లు ప్లే ఆఫ్స్ ఆడాడు. ఈ గణాంకాలే రాయుడు గోల్డెన్ లెగ్ అని చెప్పడానికి నిదర్శనం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.