ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కి అంబటి రాయుడు వీడ్కోలు చెప్పేసాడు. తన చివరి ఇన్నింగ్స్ లో కూడా చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించిన రాయుడు.. మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
క్రికెట్ లో రిటైర్మెంట్ ప్రకటించడం ఎవరికైనా బాధే. ఎన్నో ఏళ్లుగా ఒకే జట్టులో కొనసాగుతున్న ఒక ప్లేయర్ కి చాలానే తీపి జ్ఞాపకాలుంటాయి. డ్రెస్సింగ్ రూమ్ లో ఎంజాయ్ చేసిన క్షణాలు, గ్రౌండ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు వదిలేసి వెళ్లాలంటే హృదయం బరువెక్కిపోతుంది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కనిపిస్తారు. ఎందుకంటే పుట్టినప్పటినుంచి క్రికెట్ కెరీర్ గా మలుచుకొని ఇకపై గ్రౌండ్ లో అడుగుపెట్టేది లేదని తెలిస్తే.. ఆ బాధ తట్టుకోవడం శక్తికి మించిన పనే. ప్రస్తుతం తెలుగు ప్లేయర్ అంబటి రాయుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అని తెలిసి మ్యాచ్ అనంతరం భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ మన తెలుగు ప్లేయర్ అంబటి రాయుడికి చివరి ఐపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ కి ముందే ఐపీఎల్ ఫైనల్ తన చివరి మ్యాచ్ అని ప్రకటించిన రాయుడు.. నిన్న జరిగిన మ్యాచ్ తో ఎమోషన్స్ ఆపుకోలేక కంట తడి పెట్టాడు. ఈ ఫోటో చూసిన వారెవరైనా రాయుడిని చూస్తే జాలి వేయాల్సిందే. అయితే ప్రతి ఒక్కరికీ ఇది కామన్ గా జరిగినా.. రాయుడికి మాత్రం రావాల్సిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడిన రాయుడు..ఐపీఎల్ కి గుడ్ బై చెప్పేసాడు.
రాయుడు కెరీర్ చూసుకుంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి ఆడుతూ.. అందరి దృష్టిలో పడ్డాడు. జట్టులో స్టార్లు ఎక్కువగా ఉన్న ముంబై జట్టులో రాయుడు ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీమిండియాలోకి అడుగు పెట్టాడు. భారత జట్టులో కూడా బాగానే ఆడినప్పటికీ.. 2019 లో ఫామ్ లో ఉన్న తనని ఎంపిక చేయని కారణంగా అంతర్జాతీయ కెరీర్ కి వీడ్కోలు పలికాడు. అయితే మళ్ళీ తన రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకొని చెన్నై జట్టులో చేరి అదరగొట్టాడు. తాజాగా నిన్న జరిగిన మ్యాచులో మోహిత్ శర్మ బౌలింగ్ లో వరుసగా 6,4,6 కొట్టి మ్యాచ్ ని చెన్నై వైపుకి లాగాడు. తన చివరి ఇనింగ్స్ లో కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కెప్టెన్ ధోని.. రాయుడిని స్టేజ్ మీదకి పిలిచి ట్రోఫీ తీసుకోవాల్సింది కోరి.. రాయుడికి ఘనమైన వీడ్కోలు పలికాడు. మొత్తానికి బరువెక్కిన హృదంతోనే చెన్నై జట్టుని వీడిన రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ బాగుండాలని కోరుకుందాం.
In life and sport ups and downs are a constant part. We need to be positive and keeping working hard and things will turn around.. results are not always a measure of our effort. So always keeping smiling and enjoy the process.. pic.twitter.com/1AYAALkGBM
— ATR (@RayuduAmbati) April 28, 2023