అంబటి రాయుడికి జగన్ ప్రామిస్? అందుకే రిస్క్ చేస్తున్నాడా?

క్రికెట్ లో తన ప్రస్థానాన్ని ముగించేశాడు అంబటి రాయుడు. ఐపీఎల్ ఫైనల్ నా చివరి మ్యాచ్ అని నిన్న ప్రకటించేశాడు. ప్రస్తుతం 37 ఏళ్ళ వయసున్న రాయుడు.. మరి కొన్ని సంవత్సరాలు క్రికెట్ లో కొనసాగే అవకాశమున్నా ఇలా అనూహ్యంగా గుడ్ బై చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఏంటి అని విశ్లేషిస్తే..

అంబటి రాయుడు” అంతర్జాతీయ క్రికెట్ లో ఈ పేరుకి పెద్దగా పరిచయం లేకపోయినా.. తెలుగు వారికి మాత్రం రాయుడు సుపరిచితమే. ఆంధ్రప్రేదేశ్ లోని గుంటూరు జిల్లాకి చెందిన రాయుడు..అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరు అమోఘం.ఐపీఎల్ ల్లో, దేశవాళీ క్రికెట్ లో రాణించి భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. ముఖ్యంగా రాయుడు ఐపీఎల్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడుతూ అందరి దృష్టిలో పడ్డాడు. ఇక ఆ తర్వాత రాయుడు కెరీర్ అంతా సాఫీగానే సాగింది. ఇలాంటి దశలో 2019 ప్రపంచ కప్ లో శిఖర్ ధావన్ ప్లేస్ లో ఫామ్ లో ఉన్న రాయుడిని ఎంపిక చేయకపోవడంతో మనస్తాపానికి గురై అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకొని ఐపీఎల్ లో కొనసాగినా .. తాజాగా ఇదే నా చివరి మ్యాచ్ అని  ప్రకటించేశాడు.

ఐపీఎల్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ నిన్న జరగకపోవడంతో ఈ రోజుని రిజర్వ్ డే గా ప్రకటించారు. అయితే ఈ ఫైనల్ కి ముందు ఇదే నా చివరి మ్యాచ్ అని రాయుడు ఈ మెగా లీగ్ కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. దీంతో రాయుడు ఫామ్ లో లేడు అందుకే ఐపీఎల్ కి గుడ్ బై చెప్పాడని భావించారంతా. కానీ దీని వెనక మరో కారణముందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం 37 ఏళ్ళ వయసున్న రాయుడు.. ఇంకా ఐపీఎల్ లో కొనసాగే అవకాశమున్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి రాజకీయాల మీద ఆసక్తి అని తెలుస్తుంది.

“చిన్నప్పటి నుంచి బాగా చదివి సివిల్ సర్వీసెస్ తో ప్రజలకు సేవ చేయాలని భావించినప్పటికీ.. క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ కల నెరవేర్చుకోలేకపోయాను… అయితే రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు చేసే అవకాశం లభిస్తుందని.. అందుకే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవలే అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. పుట్టింది గుంటూరు జిల్లా.. పెరిగింది మాత్రం హైదరాబాద్. అందుకే అంబటి ఏపీ రాజకీయాపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి తగ్గట్లే ఇటీవలే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రిజగన్ మోహన్ రెడ్డి వీలు దొరికినప్పుడల్లా పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. అంబటి రాజకీయాలపై ఆసక్తి ఉందని తెలిసి ఏపీలో పలు పార్టీలు ఆయనకు ఆహ్వానాలు పలికినట్లు సమాచారం. 2024 లో ఎలక్షన్స్ ఉండడంతో రాయుడు ఇక క్రికెట్ ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి చేరబోతున్నాడనే సంకేతం ఇచ్చినట్లుగా స్పష్టంగా అర్ధం అవుతుంది. ఈ మేరకు జగన్ నుండి ఏమైనా హామీ అందడం వలనే ఇలా ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed