ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. క్రికెట్ అభిమానులకు ప్రతి మ్యాచ్ ఒక పండగలా జరుగుతోంది. ప్రతి అభిమాని తమ ఫేవరెట్ జట్టు గెలవాలంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. మరోవైపు ఫ్రాంచైజీలు కూడా సోషల్ మీడియా పేజెస్ పెట్టుకుని నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి.
ఐపీఎల్ 2023లో ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఫలితం తేలడం లేదు. ప్రతి అభిమాని టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ లు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఐపీఎల్ సీజన్ లో 18 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక నెట్ రన్ రేట్ తో రాజస్థాన్ జట్టు టాప్ లో కొనసాగుతోంది. తర్వాతి స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఉంది. ఇంక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది. కోల్ కతాతో మ్యాచ్ లో విజయం సాధిస్తే ఎస్ఆర్ హెచ్ స్థానం మరింత మెరుగుపడుతుంది. అయితే ఇప్పుడు నెట్టింట కేకేఆర్ పై తెలుగు ప్రేక్షకులు గుర్రుగా ఉన్నారు.
సాధారణంగా కేకేఆర్ జట్టుకు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉంటారు. మ్యాచ్ సందర్భంగా వారి అభిమాన జట్టుకు సపోర్ట్ చేసుకుంటారు. కానీ, ఈసారి మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ సన్ రైజర్స్ కే మా సపోర్ట్ అంటున్నారు. ఎందుకంటే కేకేఆర్ ట్విట్టర్ అడ్మిన్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు. ఒక జట్టుతో మ్యాచ్ అన్నాక ట్విట్టర్ లో అడ్మిన్లు సరదాగా సంభాషణలు, మ్యాచ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం చేస్తుంటారు. కేకేఆర్ అడ్మిన్ ఆల్ ది బెస్ట్ చెబుతున్న పోస్టులో అల్లు అర్జున్ ప్రస్తావన చేశాడు. ఒక బిర్యానీ పిక్ పెట్టి ఎస్ఆర్ హెచ్ అడ్మిన్ బిర్యానీలపై మన ప్రేమను పంచుకుందాం. ఈరోజు అద్భుతమైన మ్యాచ్ ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పాడు.
Tonight we bring out the claws 🦅🔥
The fire is 🔛 as we take on the Knight Riders 💥 pic.twitter.com/yFqlihn4p8
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2023
దానికి కొనసాగింపుగా మీ సినిమాల్లో మీకు అల్లు అర్జున్ ఎంత ఇష్టమో.. మాకు మా బిర్యానీలో ఆలూ అంత ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ ని ఆలూ పోల్చడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అలా ఒక ప్రాంతానికి పరిమితం చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్ చేశారు. ఇంకొందరు అసలు బిర్యానీలో ఆలుగడ్డ ఏంటి? అలా ఎలా తింటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ కి కేకేఆర్ అడ్మిన్ సోషల్ మీడియాలో మంచి స్ట్రాటజీనే ప్లే చేశాడంటూ చెబుతున్నారు. అల్లు అర్జున్ ని ఆలూతో పోల్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hey, @SunRisers admin! Let’s share our love for biryanis and have a great game tonight! 🙌
P.S. Just like you love 𝘼𝙡𝙡𝙪 in your films, we love 𝘼𝙡𝙪 in our biryani 😉 pic.twitter.com/jOKa09ly03
— KolkataKnightRiders (@KKRiders) April 14, 2023