ఐపీఎల్-2023 ఆరంభంలో వరుస ఓటములతో డీలాపడ్డ ముంబై ఇండియన్స్.. టోర్నీ ద్వితీయార్థంలో చెలరేగుతోంది. సరిగ్గా ప్లేఆఫ్స్‌కు ముందు ఆ జట్టు గేర్లు మార్చింది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని ఓడిస్తూ పోతోంది.
ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ తమ క్వాలిఫికేషన్ అవకాశాలను పెంచుకుంటోంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 27 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత రోహిత్ సేన బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 218 రన్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (31), రోహిత్ శర్మ (29) జట్టుకు మంచి స్టార్ట్‌ను అందించారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (103) సెంచరీతో చెలరేగడంతో గుజరాత్ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది ముంబై. మిస్టర్ 360 గ్రౌండ్ నలువైపులా షాట్లు కొడుతూ ప్రేక్షకులను అలరించాడు. అతడికి ఎలా బౌలింగ్ చేయాలో గుజరాత్ బౌలర్లకు పాలుపోలేదు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ తేలిపోయింది. ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు.
టైటాన్స్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (2), శుబ్‌మన్ గిల్ (6)తో పాటు సారథి హార్దిక్ పాండ్యా (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. విజయ్ శంకర్ (29), డేవిడ్ మిల్లర్ (41)లకు శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ (32 బాల్స్‌లో 79) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 10 సిక్సులతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి సహకరించే మరో బ్యాట్స్‌మన్ క్రీజులో ఉండి ఉంటే గుజరాత్ సులువుగా మ్యాచ్ గెలిచేది. రషీద్ ఖాన్ బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్ కూడా అద్భుతంగా చేశాడు. 4 వికెట్లతో మరోమారి సత్తా చాటాడు. గుజరాత్ మీద ముంబై గెలుపులో అందరూ సూర్యకుమార్ యాదవ్‌కు ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారు. అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ ముంబై సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించాడు.
సూర్యకుమార్ కాంట్రిబ్యూషన్‌ను కాదనలేం. కానీ ముంబై విక్టరీలో మరో ప్లేయర్ కీలక పాత్ర పోషించాడు. అతడే పేసర్ ఆకాష్ మధ్వాల్. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ను ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బతీశాడు మధ్వాల్. ఓపెనర్లు సాహా, గిల్‌ను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు పంపాడు. ముఖ్యంగా గిల్‌ను అతడు క్లీన్ బౌల్డ్ చేసిన విధానం సూపర్బ్ అనే చెప్పాలి. ఆ తర్వాత జోరు మీద ఉన్న మిల్లర్‌ను చక్కటి బాల్‌తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 4 ఓవర్లు వేసిన మధ్వాల్.. 31 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. గిల్ క్రీజులో కుదురుకున్నా, మిల్లర్ మరింత ఎక్కువ సేపు ఆడున్నా ముంబైకి మ్యాచ్ గెలవడం కష్టం అయ్యేది. ఆ ఇద్దర్నీ ఔట్ చేసిన మధ్వాల్‌ను మెచ్చుకోక తప్పదు. గుజరాత్‌పై గెలుపులో మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చిన మధ్వాల్పై సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
Massive wicket! 🙌
Akash Madhwal gets another wicket and now that of Shubman Gill#GT are 48/3 after 6 overs
Follow the Match: https://t.co/o61rmJX1rD#TATAIPL | #MIvGT pic.twitter.com/ApdERw7HE2
— IndianPremierLeague (@IPL) May 12, 2023