Ajinkya Rahane, MS Dhoni: టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే ముంబై ఇండియన్స్‌పై అద్భుతం ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత ధోని.. రహానే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2023లో అన్ని జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లు కూడా క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని పంచాయి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రాజస్థాన్ రాయల్స్ ఓడిస్తే.. రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిన ముంబై.. ఈ మ్యాచ్‌లో భారీ మార్పులతో బరిలోకి దిగినా ఫలితం మాత్రం మారలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రోహిత్ 13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 21 రన్స్ చేసి వేగంగా ఆడే క్రమంలోనే తుషారా దేశ్‌పాండే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. గ్రీన్(12), సూర్యకుమార్ యాదవ్(1) మరోసారి దారుణంగా నిరాశపరిచారు. టిమ్ డేవిడ్ 22 బంతుల్లో ఫోర్, రెండు సిక్సులతో 31 పరుగుల చేసి ఊపుమీద కనిపించినా.. అదే ఊపులో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో ముంబై తక్కువ స్కోర్‌కే అవుట్ అయింది.
తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడి.. రెండో మ్యాచ్‌లో లక్నోపై విజయం సాధించిన చెన్నై.. మూడో మ్యాచ్‌లో ముంబైపై మార్పులతో బరిలోకి దిగింది. సీనియర్ ప్లేయర్ రహానేను తుది జట్టులోకి తీసుకుంది. ఆ మార్పు అద్భుతంగా పనిచేసింది. చాలా కాలం తర్వాత గ్రౌండ్‌లోకి దిగిన రహానే దుమ్మురేపాడు. ఓపెనర్ డెవాన్ కాన్వె డకౌట్ అయినా.. ఆ ప్రభావం చెన్నైపై పెద్దగా పడకుండా చూసుకున్నాడు. క్రీజ్‌లోకి వచ్చిన మొదలు ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రహానే కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఒక ఓవర్‌లో అయితే.. ఏకంగా 6,4,4,4,4,1 బాది 23 పరుగులు పిండుకున్నాడు. రహానేలోని ఈ జోరు చూసి.. క్రికెట్ లోకం ఆశ్చర్యంలో మునిగిపోయింది. మొత్తం మీద కేవలం 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సులతో 61 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడి తనలో ఇంకా పసతగ్గలేదని నిరూపించాడు. రహానేతో పాటు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (40 నాటౌట్), శివమ్ దూబే(28), అంబటి రాయుడు(20 నాటౌట్) రాణించడంతో చెన్నై రెండో గెలుపు నమోదు చేసుకుంది.
ఇక మ్యాచ్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మాట్లాడుతూ.. రహానే బ్యాటింగ్ గురించి తనకు బాగా తెలుసని, భారీ సిక్సులు కొట్టలేకపోయినా.. టెక్నికల్‌గా రహానే టాప్ అని కొనియాడాడు.అందుకు అతని నుంచి ఏం ఆశిస్తున్నానో రహానేకు ముందే వివరించా.. ఈ రోజు అతను ఆడిన ఇన్నింగ్స్ తనకు చాలా బాగా నచ్చిందని అన్నాడు. అలాగే చెన్నై స్పిన్నర్లను సైతం ధోని మెచ్చుకున్నాడు. పవర్‌ప్లే తర్వాత పిచ్ నుంచి పెద్ద సహకారం లేకపోయినా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని అన్నాడు. ఆ తర్వాత మగాల, ప్రిటోరియస్ కూడా బాగా బౌలింగ్ చేసినట్లు ధోని కొనియాడాడు. ఇక యువ పేసర్ తుషార్ దేశ్‌పాండే ఇంకా నేర్చుకుంటున్నాడని, రోహిత్‌ను అతను అవుట్ చేసిన బంతి సూపర్ డెలివరీ అని చెప్పాడు. మరి ఈ మ్యాచ్‌లో రహానే ప్రదర్శనతో పాటు ధోని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni said, “I told Ajinkya Rahane to go and enjoy, don’t take stress. I’m very happy with the way he batted”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2023