ఐపీఎల్ ఫస్ట్ మ్యాచులో బెంగళూరు జట్టు గెలిచిందని అందరూ తెగ సంబరపడిపోతున్నారు. కానీ ఈ సీజన్ లో ఆర్సీబీకి వరసగా మూడో షాక్ తగలడం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఐపీఎల్ తాజా సీజన్ ఫస్ట్ మ్యాచ్ లోనే ముంబయి జట్టుపై గెలిచేసరికి కప్ కొట్టినంత ఆనందపడిపోతున్నారు. కోహ్లీ, డుప్లెసిస్ మాస్ బ్యాటింగ్ చూసి ‘ఈ సాలా కప్ నమదే’ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఈసారి గ్యారంటీగా కప్ కొట్టేది ఆర్సీబీనే అని అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇలా అంత బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ బెంగళూరు జట్టుకు తగిలిన మూడు వరస దెబ్బల్ని ఎవరూ గుర్తించట్లేదు. ఈ విషయమే వచ్చే మ్యాచుల్లో ఎఫెక్ట్ చూపించొచ్చని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఏంటా విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం మ్యాచ్ జరిగింది. ముంబయిపై బెంగళూరు గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన ఓ దశలో 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాపార్డర్ కుప్పకూలిపోవడంతో ఆర్సీబీ బౌలర్లు.. ప్రత్యర్థి జట్టుని చాలా తక్కువ పరుగులకే ఆలౌట్ చేస్తారని అంతా భావించారు. తొలి 15 ఓవర్లు ఆర్సీబీ బౌలర్లు బాగా ఫెర్ఫార్మ్ చేశారు. కానీ చివర్లో మాత్రం చేతులెత్తేశారు. దీంతో ముంబయి జట్టు నిర్ణీత ఓవర్లు ఆడి 171 స్కోరు చేసింది. అనంతరం కోహ్లీ-డుప్లెసిస్ మాస్ బ్యాటింగ్ చేసి బెంగళూరు జట్టుని గెలిపించారు. అయితే ఇక్కడ ఆర్సీబీ బౌలింగ్ గురించి, మ్యాచ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలి.
ముంబయితో మ్యాచ్ లో ఓ క్యాచ్ పట్టేందుకు సిరాజ్, దినేశ్ కార్తిక్, టోప్లే ప్రయత్నించారు. ఈ క్రమంలోనే టోప్లే భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. నొప్పితో విలవిలలాడిపోయాడు. మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. అతడి గాయం కాస్త పెద్దదిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం.. ఈ సీజన్ లో ఆర్సీబీ తగిలిన మూడో షాక్ ఇది అవుతుంది. ఎందుకంటే ఈ సీజన్ ప్రారంభానికి ముందే రజత్ పాటిదార్, హేజిల్ వుడ్ గాయాలతో దూరమయ్యారు. పాటిదార్.. సగం మ్యాచుల తర్వాతైనా సరే వచ్చే ఛాన్సుంది. కానీ హేజిల్ వుడ్ మొత్తం సీజన్ కే దూరం కానున్నాడు! ఇదంతా చూస్తుంటే.. ఈ గాయాల ఎఫెక్ట్ అనేది ఆర్సీబీ తర్వాతి మ్యాచులపై పడకపోతే అదే హ్యాపీ. లేదంటే మాత్రం బెంగళూరుకు తిప్పలు తప్పవు! మరి ఆర్సీబీ ఆటగాళ్లకు వరస గాయాలు కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Patidar, Hazelwood, Topley – the list continues for RCB.
Hope he recovers soon. pic.twitter.com/1WEKeZTxZZ
— Johns. (@CricCrazyJohns) April 2, 2023